Magnesium : శరీరానికి మెగ్నీషియం ఎంత అవసరమో తెలుసా?..

మ‌న శ‌రీరంలో మెగ్నిషియం లోపిస్తే ఆక‌లి బాగా త‌గ్గుతుంది. లేదా ఆక‌లి అస్స‌లే ఉండ‌దు. వికారంగా అనిపిస్తుంది. వాంతులు అవుతాయి.

Magnesium : శరీరానికి మెగ్నీషియం ఎంత అవసరమో తెలుసా?..

Magnesium Benefits

Magnesium : నరాలు,కండరాలు,కణాలు,ఎముకలు మరియు గుండె యొక్క సరైన పనితీరుకు మెగ్నీషియం అవసరత ఎంతైనా ఉందని చెప్పాలి. శరీరం సాధారణంగా సమతుల్య ఆహారం నుండి మెగ్నీషియంను గ్రహిస్తుంది. మ‌న శ‌రీరానికి నిత్యం అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అవ‌స‌రం అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వాటి వ‌ల్ల శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. శ‌క్తి అందుతుంది. అలాగే అనేక జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌హించ‌బ‌డ‌తాయి. అయితే మిన‌ర‌ల్స్ లో మెగ్నీషియం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువ‌ల్ల ఇది ఉన్న ఆహారాల‌ను కూడా నిత్యం మ‌నం తీసుకోవాల్సి ఉంటుంది. మెగ్నిషియం వ‌ల్ల మ‌న శ‌రీరం మ‌నం తిన్న ఆహారంలో ఉండే ప్రోటీన్ల‌ను స‌రిగ్గా జీర్ణం చేస్తుంది. కండ‌రాలు, నాడులు స‌రిగ్గా ప‌నిచేస్తాయి. షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఎముక‌లు దృఢంగా ఉంటాయి.

పుట్టిన‌ప్ప‌టి నుంచి 6 నెల‌ల వ‌య‌స్సు ఉన్న చిన్నారుల‌కు నిత్యం 30 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవ‌స‌రం. 7 నుంచి 12 నెల‌ల వ‌య‌స్సు ఉన్న‌వారికి 75 మిల్లీగ్రాములు, 1 నుంచి 3 ఏళ్ల వారికి 80 మిల్లీగ్రాములు, 4 – 8 ఏళ్ల వారికి 130 మిల్లీగ్రాములు, 9నుండి13 ఏళ్ల వారికి 240 మిల్లీగ్రాములు, 14నుండి18 ఏళ్ల వారికి, బాలురకు 410 మిల్లీగ్రాములు, బాలిక‌లకు 360 మిల్లీగ్రాములు, 19 నుంచి 30 ఏళ్ల వారికి, బాలురకు 400 మిల్లీగ్రాములు, బాలిక‌లకు 310 మిల్లీగ్రాములు, 31నుండి50 ఏళ్ల వారికి, పురుషులకు 420 మిల్లీగ్రాములు, స్త్రీలకు320 మిల్లీగ్రాములు, 51 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి, పురుషులకు 420 మిల్లీగ్రాములు, స్త్రీలకు 320 మిల్లీగ్రాములు, గ‌ర్భంతో ఉన్న‌వారికి నిత్యం 350 నుంచి 400 మిల్లీగ్రాములు, పాలిచ్చే త‌ల్లుల‌కు 310 నుంచి 360 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమౌతుంది.

మనం తీసుకునే ఆహారంలో మెగ్నీషియం లేకపోతే.. కిడ్నీలు తమ వద్ద ఉన్న మెగ్నీషియంను అందించి ఆదుకుంటుంది. అయితే ఇది ఇలాగే కొనసాగితే, చివరకు మూత్రపిండాలు చెడిపోయే ప్రమాదం ఉంది. శరీరానికే కాదు, తగినంత మెగ్నీషియం తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. మెగ్నీషియం శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు చక్కగా నిద్ర వచ్చేలా చేస్తుంది. బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. హార్మోన్స్ సరిగా పనిచేసేందుకు సాయపడుతుంది. మన శరీరంలో వందల కొద్దీ ఎంజైంల పనితీరును మెగ్నీషియం మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచీ మనకు ఎనర్జీ వచ్చేలా చెయ్యడంలో మెగ్నీషియంది కీలక పాత్ర. ఎముకలు గట్టిగా ఉండాలన్నా, నరాలు, నాడీ వ్యవస్థ చక్కగా ఉండాలంటే కూడా మెగ్నీషియం ఎంతో అవసరం.

మ‌న శ‌రీరంలో మెగ్నిషియం లోపిస్తే ఆక‌లి బాగా త‌గ్గుతుంది. లేదా ఆక‌లి అస్స‌లే ఉండ‌దు. వికారంగా అనిపిస్తుంది. వాంతులు అవుతాయి. తీవ్ర‌మైన అల‌స‌ట‌, నీర‌సం ఉంటాయి. చేతులు, కాళ్లు స్ప‌ర్శ లేన‌ట్లు అవుతాయి. చేతులు, కాళ్ల‌లో సూదుల‌తో గుచ్చిన‌ట్లు అవుతుంది. కండ‌రాలు ప‌ట్టేస్తాయి. గుండె అసాధార‌ణ రీతిలో కొట్టుకుంటుంది. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ప‌రీక్ష‌లు చేయించుకుని మెగ్నీషియం లోపం ఉంటే అందుకు త‌గిన విధంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. చిన్న పేగులలో ఆహారాన్ని జీర్ణం చేయడంలో, అవసరమైన పోషకాలను గ్రహించడంలో మెగ్నీషియం పాత్ర ముఖ్యమైనది. శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే మీ ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఆహారం తిన్న తర్వాత వికారం, వాంతులు ఉంటాయి.

మెగ్నిషియం మ‌న‌కు పాల‌కూర‌, ఇత‌ర ఆకుకూర‌లు, న‌ట్స్‌, సీడ్స్, అవ‌కాడో, అర‌టి పండ్లు, డార్క్ చాకొలేట్‌, చేప‌లు, చీజ్‌, ప‌ప్పు దినుసులు వంటి అనేక ఆహారాల్లో ల‌భిస్తుంది. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మెగ్నిషియం లోపం రాకుండా ఉంటుంది. మెగ్నీషియం గుమ్మడికాయ గింజల్లో ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయల్లో కూడా మెగ్నీషియం లభిస్తుంది. వీటితోపాటు డార్క్ చాకొలెట్స్‌లలో కూడా మెగ్నీషియం ఉంటుంది. ఖర్జూరాలు, బఠాణీలు, కోకో, బ్రకోలీ, క్యాబేజీ, గ్రీన్ బఠాణీలు, మొలకలు, సాల్మన్‌ చేపలు, ట్యూనా చేపలు, బ్రౌన్‌రైస్‌లతో మెగ్నీషియం దొరుకుతుంది. బాదం, జీడిపప్పు, బ్రెజిల్ గింజలు మెగ్నీషియం లభించే మంచి వనరులు. అరటిపండ్లలో కూడా కావాలిసనంత మెగ్నీషియం లభిస్తుంది.