Magnesium : మెగ్నీషియం సమృద్ధిగా ఉండే అల్పాహారం వంటకాలు ఇవిగో!

కండరాలు, రోగనిరోధక వ్యవస్థ యొక్క ఆరోగ్యకరమైన పనితీరుకు, ఎముకలను బలంగా ఉంచడంలో మెగ్నీషియం సహాయపడుతుంది. మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే ఒక పోషకం

Magnesium : మెగ్నీషియం సమృద్ధిగా ఉండే అల్పాహారం వంటకాలు ఇవిగో!

Rich In Magnesium

Magnesium : మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం శరీరానికి చాలా అవసరం. ముఖ్యంగా నరాలు, కండరాలు, రోగనిరోధక వ్యవస్థ యొక్క ఆరోగ్యకరమైన పనితీరుకు, ఎముకలను బలంగా ఉంచడంలో మెగ్నీషియం సహాయపడుతుంది. మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే ఒక పోషకం, ఇది హృదయ స్పందనను స్థిరంగా ఉంచుతుంది. శరీరంలో తక్కువ స్థాయి మెగ్నీషియం అలసట, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, పిన్స్ మరియు సూదులు, నిద్రలేమి, కండరాల సమస్యలకు దారి తీస్తుంది.

రోజువారి అల్పాహారాల్లో మెగ్నీషియం ఉండేలా చూసుకోవటం వల్ల దానిలోటు భర్త చేసుకోవచ్చు. మెగ్నీషియం పుష్కలంగా లభించే అల్పాహారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. జొన్న రొట్టె ; జొన్న రోటీ అనేది జొన్న పిండి మరియు ఉప్పు కలయికతో తయారు చేయబడిన సాంప్రదాయ భారతీయ అల్పాహారం. ఇందులో మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. గ్లూటెన్ ఫ్రీగా అందుతుంది. దీనిని తయారు చేసేందుకు 1 కప్పు జొన్న పిండి, ¾ కప్పు వేడి నీరు మరియు 2-3 చిటికెడు ఉప్పు అవసరమౌతుంది. ఒక పెద్ద గిన్నెలో, పిండి వేసి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మధ్యలో నీరు చిలకరించి పిండిని ముద్దలా చేసి మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీడియం సైజు పిండిని తీసుకుని చిన్న సైజు బాల్స్‌లా తయారు చేయాలి. అరచేతిలోకి తీసుకుని వేళ్ల సహాయంతో రొట్టెలా చేసుకోవాలి. వేడి పెనంపై దానిని కాల్చుకోవాలి. అవసరమనుకుంటే దానిపై వెన్నకాని, నెయ్యికాని వేసుకుని రుచికరంగా తీసుకోవచ్చు.

2. బాదం వెన్న టోస్ట్ ; మెగ్నీషియం పుష్కలంగా ఉండే పాశ్చాత్య స్టైల్ అల్పాహారం విషయానికి వస్తే బాదం బటర్ టోస్ట్ బెస్ట్ అని చెప్పవచ్చు. దీనిని తయారు చేయటం అనేది చాలా సులభం. ఇందులో కొన్ని అరటిపండ్లను , 2 హోల్‌గ్రెయిన్ బ్రెడ్ ముక్కలను తీసుకొని, టోస్ట్ యొక్క 2 ముక్కలపై బాదం వెన్న, అరటిపండ్లను ఉంచుకోవాలి. ప్రతి స్లైస్‌పై కొంచెం తేనె వేసుకుని రుచికరంగా తీసుకోవచ్చు. దీని వల్ల శరీరానికి కావాల్సిన మెగ్నీషియం అందుతుంది.

3. అరటి వోట్ పాన్ కేక్ ; అరటి వోట్ పాన్‌కేక్‌లలలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. దీనిని తయారు చేయడానికి, పాలు, గుడ్లు, రోల్డ్ వోట్స్, బేకింగ్ పౌడర్, వెనిలా, ఉప్పు, దాల్చినచెక్క, పండిన అరటిపండ్లు,ఆలివ్ ఆయిల్ అవసరం. ముందుగా, ఓట్స్‌ను మెత్తగా పౌడర్ గా చేసుకోవాలి తరువాత పాలు, అరటిపండ్లు, గుడ్లు , వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, ఉప్పు వేసి మళ్లీ బ్లెండ్ చేయాలి. పిండిని పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. నాన్ స్టిక్ పాన్‌కు ఆలివ్ ఆయిల్ రాసి ఒక గరిటె పిండిని దానిపై వేయాలి. రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు ఉడికించాలి. పైన కొంచెం తేనె కలిపి వేడివేడిగా తీసుకోవచ్చు.

4.బచ్చలి దోస ; ఐరన్, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ మరియు సెలీనియంతో నిండిన బచ్చలికూర పోషకాల పవర్‌హౌస్. బచ్చలికూరతో దోస సిద్ధం చేయడానికి, మీకు కావలసిందల్లా బచ్చలి కూర, మినప పప్పు, మెంతులు, గోధుమ పిండి, ఉప్పు, ఆలివ్ నూనె. ముందుగా ఒక గిన్నెలో మినప పప్పు, మెంతి గింజలను వేసి నీరు కలపాలి. వాటిని 2 గంటలు నానబెట్టండి. తరువాత, నీటిని తీసివేసి వెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. దీనికి గోధుమ పిండి, ఉప్పు మరియు 1 కప్పు నీళ్లతో పాటు బచ్చలికూర పొడిని కలుపుకోవాలి. ఇలా సులభంగా పెనంపై గరిటతో దోసలు పోసుకోవాలి. లేత గోధుమరంగు వచ్చేవరకు మీడియం మంట మీద ఉడికించాలి. కొంచెం సాంబార్ మరియు చట్నీతో సర్వ్ చేసుకుని రుచికరంగా తీసుకోవాలి.

5. పెసర మొలకల సలాడ్ ; సలాడ్‌ను ఇష్టపడే వారైతే, మెగ్నీషియం యొక్క అద్భుతమైన మూలంగా పెసర మొలకల సలాడ్ ను తప్పకుండా తీసుకోవాలి. పెసర మొలకలతో సలాడ్‌ని సిద్ధం చేయడానికి, మీకు పెసర మొలకలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, ఎర్ర మిరపకాయలు, చాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు, తరిగిన కొత్తిమీర ఆకులు అవసరం. పెసర మొలకలను కడిగి నీటిని వడకట్టి బాగా ఉడికించాలి. ఉడికినతరువాత నీటిని తీసివేసి పెద్ద గిన్నెలో ఉంచుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు మరియు పచ్చిమిర్చి వేసుకొవాలి. మిరప పొడి, చాట్ మసాలా వేసి బాగా కలపాలి. ఉప్పు, నిమ్మరసం వేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. తరువాత రుచికరమైన అల్పాహారంగా తీసుకోవాలి.