Backache : నడుము నొప్పి రావడానికి కారణాలు ఇవి కూడా..

శారీరక అనారోగ్యాల కారణంగా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం చేసే చిన్న పొరపాట్లు కూడా నడుమునొప్పికి కారణం అవుతాయని మీకు తెలుసా?

back ache

Backache :  ఇటీవల కాలంలో నడుమునొప్పితో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని అనారోగ్యాల కారణంగా నడుమునొప్పి వస్తే.. కొన్ని మనం చేసే చిన్న పొరపాట్లు నడుమునొప్పికి కారణమవుతున్నాయి.

Amazing Health Benefits : పాలల్లో నెయ్యి కలుపుకుని తాగటం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు తెలుసా ?

నడుము నొప్పి రావడానికి వయసు, ఎత్తు, బరువు, ఆడ-మగ ఇలాంటి సంబంధాలు ఉండవు. రావడానికి కారణాలను తెలుసుకుంటే నివారించవచ్చును. సరైన పద్ధతిలో కూర్చోకపోతే నడుమునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల కండరాలు, ఎముకల మీద ఒత్తిడి పెరిగి వెన్నునొప్పి మొదలవుతుంది.

అధిక బరువు కూడా నడుమునొప్పికి కారణం అవుతుంది. ఎముకలు, కీళ్ల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. బరువు పెరగకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీనివల్ల కండరాల దృఢత్వాన్ని నిరోధిస్తుంది. ఇది ఒత్తిడికి గురైన కండరాలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెన్నునొప్పిని నివారిస్తుంది.

Heart Health : ఎదుగుతున్న వయస్సు వారు తమ గుండె ఆరోగ్యాన్నిజీవితకాలం కాపాడుకోవటానికి వైద్యులు ఏంసూచిస్తున్నారంటే ?

కొందరు కొన్ని వస్తువులు బరువు మోసేటపుడు తప్పుగా ఎత్తడానికి ప్రయత్నిస్తుంటారు. దానివల్ల నడుముపై ఒత్తిడి పెరుగుతుంది. వస్తువులు, ముఖ్యంగా బరువైన వాటిని ఎత్తేటపుడు జాగ్రత్తగా ఉండండి.