Amazing Health Benefits : పాలల్లో నెయ్యి కలుపుకుని తాగటం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు తెలుసా ?

వేడి పాలలో నెయ్యిని కలుపుకుని తీసుకోవటం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా కేలరీలు అధింకంగా శరీరానికి అందుతాయి. బరువు పెరగాలనుకునేవారికి, కండరాల నిర్మాణం కోరుకునే వారికి ప్రయోజనకరం.

Amazing Health Benefits : పాలల్లో నెయ్యి కలుపుకుని తాగటం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు తెలుసా ?

milk with ghee

Amazing Health Benefits : పాలు, పాల ఉత్పత్తులు ఎన్నో ఏళ్ళ కాలంగా మన ఆహారంలో భాగమై పోయాయి. వీటి వల్ల శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అదే సయమలో ఆయుర్వేదం సూచిస్తున్నట్లు పాలలో నెయ్యిని కలుపుకుని తీసుకోవటం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సూచిస్తున్నారు. వాస్తవానికి నెయ్యిని పాల నుండే తయారు చేస్తారు. పాలను మరగించి దానిలో తోడు వేస్తారు. అది కొన్ని గంటల తరువాత గట్టిపడి పెరుగుగా మారుతంది. పెరుగును బాగా చిలకగా వెన్న వస్తుంది. వెన్నను వేరు చేసి దానిని బాగా మరిగిస్తే నెయ్యిగా మారుతుంది.

READ ALSO : Minister Roja Selvamani : ఆడదాన్ని ఏడిపిస్తే ఏమవుతుందో తెలుసా?.. చాగంటి ప్రవచనం వీడియో షేర్ చేసిన మంత్రి రోజా

వేడి పాలలో నెయ్యిని కలుపుకుని తీసుకోవటం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా కేలరీలు అధింకంగా శరీరానికి అందుతాయి. బరువు పెరగాలనుకునేవారికి, కండరాల నిర్మాణం కోరుకునే వారికి ప్రయోజనకరం. నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణ వ్యవస్ధ ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. పేగులలో మంచి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. పాలలో కాల్షియం ఉంటుంది. వాటిలో నెయ్యి కలిసినప్పుడు ఎముక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

READ ALSO : Street Food : నోరూరించే స్ట్రీట్ ఫుడ్ తో కాలేయానికి ముప్పు !

పాలు,నెయ్యి మిశ్రమంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు , కొవ్వులు శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా, నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు , పాలలోని విటమిన్లు చర్మం , జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నెయ్యి, పాలను పోషకాహార అమృతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. కడుపు దోషాలను సమతుల్యం చేస్తుంది. మొత్తం ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది. పాలలో , నెయ్యి కలుపుకుని తాగడం అన్నది కొన్ని సంస్కృతులలో ఒక సంప్రదాయ పద్ధతిగా నేటికి కొనసాగుతుంది. ఇలా చేయటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు.

READ ALSO : Chandrayaan-3 Mission : మరో అద్భుతం సృష్టించిన ఇస్రో.. విక్రమ్ ల్యాండర్లో కదలిక..!

నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యంగా సంతృప్త కొవ్వులు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వులు పాలలో విటమిన్లు A, D, E, K వంటి కరిగే విటమిన్లు శరీరానికి అందేలా చేస్తాయి. పాలలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం శరీరంలోకి చేరుకుని సెరోటోనిన్గా మారుతుంది. ఇది మన శరీరానికి విశ్రాంతినిస్తుంది. తద్వారా మనకు మంచి నిద్ర పడుతుంది.

READ ALSO : గోరు వెచ్చని నీరు ఎప్పుడు తాగాలో తెలుసా?

ఒత్తిడి నుండి త్వరగా బయటపడాలంటే వేడి పాలల్లో ఒక టీస్పూన్ నెయ్యిని వేసుకుని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు వేడి పాలలోనెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంపై చాలా సానుకూల ప్రభావాలు ఉంటాయి. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు నెయ్యి, పాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల కీళ్ళ వాపులు, మంట తగ్గుతుంది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు , సలహాలు పొందటం మంచిది.