కోవిడ్ టెంపరేచర్ చెక్ చేయడంవల్ల మంచికన్నా, చెడే ఎక్కువ!

  • Publish Date - July 24, 2020 / 06:29 PM IST

జ్వరం, లేదంటే టెంపరేచర్ పెరిగినంత మాత్రాన కోవిడ్ వచ్చినట్లు కాదు. బాడీ టెంపరేచర్ చూసి ఓకే అనుకుంటే…అసలు కరోనా రోగులను జనంలోకి వదిలేసినట్లేనంటున్నారు నిపుణులు. మీరు ఎక్కడికైనా వెళ్లండి. రెస్టారెంట్, షాపింగ్, ఆఫీసులు ఏవైనా సరే, టెంపరేచర్ చెక్ చేయడం సాధారణం.

నార్మల్ గా ఉంటే వాళ్లంతా సేఫ్ అనుకొని లోపలికి అనుమతిస్తారు. The Centers for Disease Control and Prevention (CDC) కానీ, ఐసీఎంఆర్ కానీ ప్రతిరోజూ, ప్రతిచోటా టెంపరేచర్ చెక్ చేయమనే చెప్పాయి. నిజానికి కరోనా రోగ లక్షణాలను చెక్ చేయడానికి టెంపరేచర్ ప్రమాణం కాదని, అసలు అది సైంటిఫిక్ కాదనే భావిస్తున్నారు సైంటిస్టులు. నిజానికి COVID-19 పెరగడానికి ఈ ధోరణం కారణం కావచ్చనని కూడా అనుమానిస్తున్నారు.

టెంపరేచర్ చెక్ చేయడం వల్ల కరోనాను కట్టడం చేసినట్లు ఎక్కడా, ఏ సర్వేలోనూ వెల్లడి కాలేదు. నిజానికి Temperature Checkకి ఎలాంటి విలువాలేదు. ఈ పద్ధతిని వదిలేస్తే బెటర్ అన్నది కొందరు సైంటిస్టుల మాట.
టెంపరేచర్ చెక్ చేయడం కొత్తేమీకాదు. 2000ల్లో SARS వచ్చినప్పుడు టెంపరేచర్ టెస్ట్ చేసేవాళ్లు. మొత్తం పేషెంట్లలో 86శాతం మందికి సార్స్ వస్తే తీవ్రంగా జర్వం వచ్చింది. అది రోగ లక్షణం కూడా. అందుకే ఆ టెక్నిక్ బాగా పనిచేసింది. అలాగని సార్స్‌ను తగ్గించడంలో దీని పాత్ర పెద్దగా లేదనికూడా తేలింది.

టెంపరేచర్ చెక్ చేయడం చాలా సులువు. రేటు తక్కువ. అందుకే ప్రతిషాపు, ప్రతి ఆఫీసులోనూ రెండు, మూడు వేలకు దొరికే Infrared Digital Thermometerను వాడుతున్నారు. కాకపోతే SARS-CoV-2కి COVID-19కి కారణమయ్యే వైరస్ కు మధ్య తేడా చాలానే ఉంది. అందుకే టెంపరేచర్ చెక్ అన్నది ఈసారి నిరూపయోగం.

కారణం ఒక్కటే. కరోనా వచ్చినవాళ్లలో సగం కన్నా తక్కువ మందికే జ్వరం వస్తుంది. టెంపరేచర్ బాగా పెరగడానికి ముందే మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈలోగా వాళ్లు వేరే వాళ్లకు కరోనాను అంటిస్తారుకూడా.
నిజానికి, కుర్రాళ్లలో కరోనా వచ్చినా వాళ్లలో ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవు. హెల్థీగా ఉండేవాళ్లలో ఒక్క లక్షణంకూడా కనిపించకపోవచ్చు.

ఇది ఫ్లూ వచ్చేకాలం. అమెరికాలో వేలాదిమందికి ఫ్లూ వస్తోంది. ఇది ప్రమాదకరం కాదు. కానీ జ్వరాన్ని చూసి కరోనా అనుకొనే ప్రమాదమూ ఉంది. ఇప్పుడేం చేయాలి? జ్వరం రాలేదు కాబట్టి ఒకరికి కరోనా రాలేదని మనం అనుకొంటాం. ధైర్యంగా అతనితో ప్రవర్తిస్తాం. ఈ ధోరణే ప్రమాదకరమంటున్నారు.. దీనివల్ల మేలుకన్నా….కీడే ఎక్కువ అని అంటున్నారు సైంటిస్టులు.

ట్రెండింగ్ వార్తలు