అమెరికాలోని టీనేజర్లలో ఈ ఇంజెక్షన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయిన వైనం

మార్కెట్లో ఇవి వీగోవీ, ఓజెంపిక్ వంటి పేర్లతో దొరుకుతున్నాయి. మొదట ఇలాంటి ఔషధాలను మధుమేహం కోసం మాత్రమే ఆమోదించారు.

సాధారణంగా టీనేజ్‌లో అందంపై అధిక శ్రద్ధ పెడతారు. తోటి వారితో పోల్చుకుంటూ వారి కంటే అందంగా కనపడాలని, వారి కంటే స్లిమ్‌గా ఉండాలని తహతహలాడుతుంటారు. బరువు అధికంగా ఉంటే మనోవేదనను అనుభవిస్తుంటారు.

అమెరికాలో ఈ ధోరణి అధికంగా కనపడుతోంది. ఊబకాయం ఉన్న వారికి గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, స్ట్రోక్‌తో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యల ముప్పు ఉంటుంది. అమెరికాలో ప్రతి ఐదుగురు టీనేజర్లలో (13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారికి) ఒకరికి ఊబకాయం ఉంది.

దీంతో చాలా మంది టీనేజర్లు బరువు తగ్గడానికి జీఎల్పీ-1 (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్ 1) ఇంజక్షన్లను విపరీతంగా తీసుకుంటున్నారు. బరువు తగ్గడానికి టీనేజర్లు విపరీతంగా వీటిని వాడుతుండడంతో ఇటువంటి మందులు సురక్షితమేనా అన్న ఆందోళన నెలకొంది.

ఊబకాయం వంటి సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారంగా ఇటువంటి మందులను ఉపయోగించే తీరుపై తాము ఆందోళన చెందుతున్నామని పిల్లల డాక్టర్ డాన్ కూపర్ చెప్పారు. అధిక బరువు సమస్యకు త్వరిత గతిన పరిష్కారం పొందాలని టీనేజర్లు జీఎల్పీ-1ను వాడుతున్నారని వైద్యులు అంటున్నారు.

సురక్షితమేనా?
దీర్ఘకాలికంగా ఇది సురక్షితమేనా? అన్న ఆందోళన ఉందని చెబుతున్నారు. 2021లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) బరువు తగ్గడానికి కొత్త ఔషధాలను ఆమోదించింది. వాటిని జీఎల్‌పీ-1లు అంటారు. మార్కెట్లో ఇవి వీగోవీ, ఓజెంపిక్ వంటి పేర్లతో దొరుకుతున్నాయి. మొదట ఇలాంటి ఔషధాలను మధుమేహం కోసం మాత్రమే ఆమోదించారు.

అయితే, బరువు తగ్గడానికి కూడా వీటిని వాడవచ్చని 2021లో ఎఫ్‌డీఏ ఆమోదముద్ర వేయడంతో వీటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా వీటిని యువత అధికంగా వాడుతోంది. కొన్ని జీఎల్పీ-1లను 12 ఏళ్లలోపు పిల్లలు వాడడానికి కూడా ఆమోద ముద్ర పడింది. 2020 నుంచి 2023 మధ్య జీఎల్పీ-1ల వాడకం ఆరు రెట్లు (594 శాతం) పెరిగిందని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం టీనేజర్లకు, చిన్నపిల్లలకు కూడా డాక్టర్లు జీఎల్పీ-1 డ్రగ్స్‌ను ప్రిస్క్రిప్షన్‌లో రాసిస్తున్నారు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్న అమ్మాయిల్లో దీని వినియోగం 659 శాతం పెరగగా, అదే వయసు అబ్బాయిల్లో వాటి వాడకం 481 శాతం పెరిగింది.

పిల్లల స్థూలకాయానికి ఎలా చికిత్స చేయాలన్న దాని గురించి పిల్లల వైద్యులు, పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్టులు, ఇతర వైద్యుల మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఇటువంటి డ్రగ్స్ స్వల్పకాలిక ప్రయోజనాల కోసం వాడకూడదు. ఈ మందులు తీసుకోవడం మానేసిన వారిలో ఆకలి పెరుగుదల, బరువు మళ్లీ పెరగడం వంటి వాటితో బాధపడతారు.

Best Mobile Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 35వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!