Best Mobile Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 35వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Best Mobile Phones : ఈ సెప్టెంబర్‌లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల టాప్ 5జీ స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి. 

Best Mobile Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 35వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Best Mobile Phones under Rs 35k in September 2024

Updated On : September 28, 2024 / 3:42 PM IST

Best Mobile Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. పర్ఫార్మెన్స్ ఫీచర్‌లు, డిస్‌ప్లే క్వాలిటీని అందించే అద్భుతమైన డిస్‌ప్లే, ప్రాసెసర్ లేదా కెమెరా వంటి ముఖ్యమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ నుంచి రియల్‌మి, పోకో వంటి  మరో మూడు ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఈ సెప్టెంబర్‌లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల టాప్ 5జీ స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

Read Also : Best Mobile Phones : కొత్త ప్రీమియం ఫోన్ కావాలా? ఈ సెప్టెంబర్‌లో 50వేల లోపు ధరకే బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు మీకోసం..!

వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ :
వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ ఫోన్ రూ. 35వేల స్మార్ట్‌ఫోన్లలో బెస్ట్ మోడల్. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 4 120Hz అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,500mAh బ్యాటరీ, 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పవర్ అయిపోతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఈ ఫోన్ ప్రత్యేకమైన మెటల్ యూనిబాడీ డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రీమియం డిజైన్ కలిగి ఉంది. వన్‌ప్లస్ 6 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ ఫోన్ చాలా కాలం పాటు ఫ్యూజర్ అప్‌డేట్ పొందేలా చేస్తుంది. కెమెరా సిస్టమ్ పటిష్టంగా ఉంది. వివిధ లైటింగ్ పరిస్థితులలో స్పష్టమైన ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయొచ్చు. రూ. 29,999 ధరలో వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ ఆల్‌రౌండ్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

రియల్‌మి జీటీ 6టీ 5జీ :
రియల్‌మి జీటీ 6టీ 5జీ ఫోన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. నార్డ్ 4 మాదిరిగానే ఈ ఫోన్ కూడా స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుంది. 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఉంది. అంటే.. మీ అన్ని యాప్‌లు, డేటా స్టోరేజీ మెమరీ ఉంటుంది.

120Hz కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, గేమింగ్ చేసినా లేదా వీడియోలు చూస్తున్నా మృదువైన స్క్రోలింగ్, అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఫోన్ ఓఐఎస్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. తక్కువ కాంతిలో కూడా బెస్ట్ ఫొటోలను తీయడంలో సాయపడుతుంది. 5,500mAh బ్యాటరీ 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. త్వరగా ఛార్జ్ అవుతుంది. రోజంతా ఛార్జింగ్ వస్తుంది.

పోకో ఎఫ్6 5జీ :
పోకో ఎఫ్6 5జీ మరో బెస్ట్ ఆప్షన్. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు బెస్ట్. 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు, సున్నితమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఓఐఎస్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా, పవర్‌ఫుల్ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. 5,000mAh బ్యాటరీ 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

వన్‌ప్లస్ 12ఆర్ 5జీ :
ఈ జాబితాలో వన్‌ప్లస్ 12ఆర్ 5జీ ఫోన్ ధర రూ. 39,999కు లాంచ్ అయింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఈ ఫోన్ ధర రూ. 35వేల లోపు అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ 12ఆర్ 120Hz కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. గేమింగ్, వీడియోలకు బెస్ట్ ఫోన్. ఆక్వా టచ్ స్పెషల్ ఫీచర్.

మీ చేతులు తడిగా ఉన్నప్పుడు కూడా ఫోన్‌ వాడేందుకు అనుమతిస్తుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. సాధారణం ఫొటోగ్రాఫర్‌లకు బెస్ట్ అని చెప్పవచ్చు. 5,500mAh బ్యాటరీ 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.ఇది దాదాపు 30 నిమిషాల్లో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయగలదు. మెటల్ ఫ్రేమ్ ఫోన్‌కి ప్రీమియం అనుభూతిని కూడా ఇస్తుంది.

Read Also : Whatsapp Tech Tips : వాట్సాప్‌లో మీ ఫ్రెండ్ డిలీట్ చేసిన మెసేజ్‌లను ఎలా చదవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్..!