మీ ఫుడ్‌లో వైరస్ వ్యాప్తి చేసే పదార్థాలు ఉన్నాయేమో!!

కేరళలో తొలి కరోనా వైరస్ నమోదైన తర్వాత యావత్ భారత్ ఉలిక్కిపడింది. వైరస్ నుంచి కాపాడుకోవడాన్ని పక్కకుపెడితే అసలు రాకుండా ఉండేందుకు ఏం చేయాలా అని సెర్చింగ్ మొదలుపెట్టారు నెటిజన్లు. ఈ క్రమంలోనే ముఖానికి మాస్క్‌లు కట్టుకుని తిరుగుతుండటంతో పాటు తీసుకునే ఆహారంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి మీరు తీసుకునే ఫుడ్‌లో కరోనా వ్యాప్తి చెందే పదార్థాలు ఉన్నాయా.. ఒకసారి చెక్ చేసుకోండి.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కథనం ప్రకారం.. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందట. సాధారణ జలుబులాగే అనిపించినా.. ఒకేసారి శరీరాన్ని చాలారకాలుగా బలహీనపరుస్తుందని చెబుతున్నారు. దీనిని ముందుగా మనుషులలో గుర్తించలేదంట. సార్స్ తెలిపిన వివరాలను బట్టి గబ్బిలాల నుంచి మనుషులకు సంక్రమించినట్లుగా తెలుస్తుంది. మాంసాహారం తినే వారికి ఇది కాస్త మింగుడుపడని విషయమే మరి. 

చైనాలో అడవి జంతువుల మాంసాన్ని పూర్తిగా నిషేదించారు. దానికి కారణం ఈ గబ్బిలాల్లో ఉన్న వైరస్ జంతువులను తినడం ద్వారా మనుషుల్లోకి త్వరగా వ్యాప్తి చెందుతుందని అనుమానం. ఈ విషయాన్ని వాట్సప్‌లలో ఫార్వార్డ్ చేసి మాంసాహారం తినొద్దని సూచనలు చేస్తున్నారు. మనం తీసుకునే మాంసాహారంలో ఎంతవరకూ ‌సేఫ్‌గా ఉందో తెలుసుకుందాం.

నిఫా వైరస్ విషయంలో జంతువుల నుంచి మనుషులకు త్వరగా సంక్రమించింది. ఇది మనుషులతో పాటు జంతువుల్లోనూ చాలా త్వరగా వ్యాప్తి చెందింది. ఈ వ్యాప్తి అనేది ఇన్ఫెక్షన్ కు గురైన చోటు నుంచి వెంటనే సంక్రమిస్తుంది. ఇది గబ్బిలాల్లోనే ఎక్కువగా ఉంటుంది. చైనాలోని వుహాన్ లో చెలరేగిన ఈ వైరస్ కారణంతో ఆ ప్రాంతంలో జంతువుల మాంసం ఎవ్వరూ తినడం లేదు. 

ఇదంతా నిజమేనా.. ఏ మాంసంలోనైనా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా.. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆరోగ్య నిపుణులు బీఎల్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డా. వివేక్ పాల్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ప్రతి ఒక్కరూ ఎగ్జోటిక్ మీట్స్(పరజాతి మాంసాహారం)కు దూరంగా ఉండాలి. మామూలు మాంసాన్ని కూడా పూర్తిగా ఉడికించి తినాలి. లేదంటే ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది’ అని తెలిపాడు. 

ఎగ్జోటిక్ మీట్స్(పరజాతి మాంసాహారం) అంటే:
* మొసలి
* మేక
* గేదె
* అడవి పంది
* నిప్పు కోడి
* కుందేలు
* బీఫ్
* కొండచిలువ