పొట్ట కొవ్వు వేగంగా తగ్గాలా..! వెంటనే ఈ మూడు ఆహారాలు బంద్ చేయండి..!

పొట్టను తగ్గించుకోవడానికి, అక్కడ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. కానీ,

Belly Fat : పొట్ట కొవ్వు.. ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న అతి పెద్ద సమస్య. పొట్ట దగ్గర కొవ్వు విపరీతంగా పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. ఇక చాలామంది సిట్టింగ్ వర్క్ చేసే వారికి సులువుగా పొట్ట వస్తోంది. అయితే, పొట్టను తగ్గించుకోవడానికి, అక్కడ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు.

కానీ ప్రయోజనం అంతగా కనిపించడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో నేచురోపతిక్ డాక్టర్ ఒకరు… పొట్ట కొవ్వు వేగంగా తగ్గాలంటే కొన్ని సూచనలు చేశారు. ఆయన మాటల ప్రకారం.. వెంటనే మూడు రకాల ఆహారాలు మానేయాలి. అధిక చక్కెర కలిగిన పండ్లు, బ్రెడ్, రైస్ కి దూరంగా ఉండాలని సూచించారు.

వేగంగా బరువు తగ్గాలనుకునే వ్యక్తులు అధిక చక్కెర కలిగిన పండ్లను తినడం మానేయమని ఆ డాక్టర్ చెప్పారు. ఆ ఎక్స్ పర్ట్ అభిప్రాయం ప్రకారం.. పుచ్చకాయలు, అరటిపండ్లు, ద్రాక్షలో చక్కెర ఎక్కువగా ఉంటుందని.. వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

“ఈ పండ్లు రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతాయి. దీని వలన శరీరం ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇన్సులిన్ కొవ్వు కణాల పెరుగుదలకు దారితీస్తుంది. అందుకే, బెర్రీలు వంటి తక్కువ చక్కెర కలిగిన పండ్లను తీసుకోవడం మేలు” అని ఆ డాక్టర్ వివరించారు. ”బరువు తగ్గాలని అనుకుంటున్న వారికి.. అరటిపండ్లు మంచి ఎంపిక కాదు. ఎందుకంటే అరటి పండులో అధిక చక్కెర శాతం ఉంటుంది. మీరు అరటిపండును తిన్నప్పుడు, అందులో ఉండే అన్ని కార్బోహైడ్రేట్లు సాధారణ చక్కెరలుగా విభజించబడతాయి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

ఈ పెరుగుదలను మనం ఎంత త్వరగా చూస్తామో దానిని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అంటారు. GI వ్యవస్థ ఆహారాన్ని 0 నుండి 100 వరకు రేట్ చేస్తుంది. 0 అంటే.. రక్తంలో చక్కెర నెమ్మదిగా పెరుగుతుంది. 100 అంటే.. వేగంగా పెరుగుతుందని అర్థం. పండిన అరటిపండులో GI 51, చక్కెరలో GI 65, స్వచ్ఛమైన గ్లూకోజ్ GI 100 కలిగి ఉంటాయి. దీని అర్థం ఏంటంటే.. బ్లడ్ షుగర్ లో స్పైక్‌కు గ్లూకోజ్ కారణమవుతుంది. ఆ తర్వాత టేబుల్ షుగర్, ఆ తర్వాత అరటిపండు ఉంటాయి. ఒక చాక్లెట్ బార్ 49కి సమానమైన GI ర్యాంకింగ్‌ను కలిగి ఉంది. మీరు అరటిపండు తినేటప్పుడు మీ బ్లడ్ షుగర్ ఎంతమేరకు పెరుగుతుందో ఇది మీకు ఐడియా ఇస్తుంది.

చక్కెర తీసుకోవడం తగ్గించాలని అనుకునే వారు నిమ్మకాయలు, అవకాడోలు, బ్లాక్‌బెర్రీలు, స్ట్రాబెర్రీలు, నారింజలు, హనీడ్యూ మెలన్ పీచెస్, గ్రేప్ ఫ్రూట్ నిల్వ చేసుకోవాలి. వాస్తవానికి, ఈ పండ్లను తినడం వల్ల అనేక పోషక ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు ప్రాసెస్ చేసిన ట్రీట్‌ల కంటే ఇవి మంచి ఎంపిక. ఇక పొట్ట కొవ్వు తగ్గించుకోవాలని అనుకునే వారు.. బ్రెడ్ కి దూరంగా ఉండాలి. ఎందుకంటే.. రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమయ్యే అత్యంత ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్ ను బ్రెడ్ కలిగి ఉంటుంది.

అంతేకాదు బ్రెడ్ లో గ్లూటెన్ ఉంటుంది. ఇది శరీరంలో మంటను కలిగిస్తుంది, తద్వారా బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. అన్నం లేని ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే బియ్యంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అవి రక్తంలో చక్కెర పెరుగుదలకు కూడా కారణమవుతాయి” అని డాక్టర్ వివరించారు.

”రక్తంలో చక్కెర పెరుగుదల ఇన్సులిన్ పెరుగుదలకు కారణమవుతుంది. తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, చిక్కుళ్ళు వంటి మంచి పిండి పదార్థాలు రక్తంలో గ్లూకోజ్‌ని త్వరగా పెంచవు. వైట్ బ్రెడ్, కుకీలు, పంచదార ఫిజీ డ్రింక్స్ వంటి చెడు పిండి పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ త్వరగా పెరగడానికి కారణమవుతాయి. ఆహారంలో శుద్ధి చేసిన పిండి పదార్థాలను తగ్గించండి. బదులుగా లీన్ ప్రోటీన్, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళతో భర్తీ చేయండి.

మొత్తం పిండి పదార్థాలను 55 శాతం కేలరీల నుండి 40 శాతానికి తగ్గించండి. ఇక.. పొట్ట కొవ్వును తగ్గించేందుకు మరొక మార్గం కదలిక అంటే వ్యాయామం. మీరు మీ రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి. శారీరక శ్రమ ఉండాలే చూసుకోవాలి. పొట్ట కొవ్వును కరిగించడంలో వ్యాయామం శక్తివంతమైనది, ప్రభావవంతమైనది” అని ఎక్స్ పర్ట్ వెల్లడించారు.

Also Read : గుండెపోటు రాకుండా నివారించే 7 మంచి రోజువారీ అలవాట్లు…!