Burning Feet: అరికాళ్లలో మంటలు.. ఆ వ్యాధి లక్షణమే కావచ్చు.. తీవ్రమైతే పెద్ద ప్రమాదమే
అరికాళ్లలో మంటలు “బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్" అనేది సాధారణంగా చాలా(Burning Feet) మందిలో కనిపించేదే. ఇది న్యూరోలాజికల్ సమస్య.

What causes burning feet? Here are some preventive measures
Burning Feet: అరికాళ్లలో మంటలు అనేవి “బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ (Burning Feet Syndrome)” అనేది సాధారణంగా చాలా మందిలో కనిపించేదే. ఇది న్యూరోలాజికల్ సమస్య యొక్క ప్రధాన లక్షణంగా మారవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, కొంతమందిలో ఈ సమస్య సాధారణమే అయినప్పటికి కొన్నిసార్లు మాత్రం తీవ్రతరం అవుతుంది. కొన్నిసార్లు ప్రమాదంగా కూడా మారుతుంది. ఇది తీవ్రమైన మరో (Burning Feet)ఆరోగ్య సమస్యకు సంకేతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఆ సమస్యలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
అరికాళ్లలో మంట కలిగించే ప్రధాన కారణాలు:
నరాల నష్టం: ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతి, మధుమేహం కారణంగా నరాలు దెబ్బతినటం వల్ల అరికాళ్లలో మంటలు రావచ్చు.
విటమిన్ లోపం: ముఖ్యంగా B12, B6, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల నరాల పనితీరు తగ్గుతుంది. ఇది కూడా కాళ్ళ మంటలకు కారణం అవుతుంది.
థైరాయిడ్ సమస్యలు: థైరాయిడ్ హార్మోన్ లోపం శరీరంలోని రక్త ప్రసరణను తగ్గించి మంటను కలిగించే అవకాశం ఉంది.
అనెమియా: ఐరన్ లోపం వల్ల నరాలకు తగిన ఆక్సిజన్ అందకపోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా మంట, అసౌకర్యం కలిగొచ్చు.
పాదాల్లో ఫంగస్ లేదా ఇన్ఫెక్షన్: అథ్లీట్స్ ఫుట్, కాళ్లలో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్స్, ఫంగస్ వంటివి కూడా మంటకు కారణం కావచ్చు.
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం: మద్యపానం వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. తద్వారా మంట అనిపించవచ్చు.
అరికాళ్ల మంట నివారణ చిట్కాలు:
1.చల్లటి నీటి గల్లు:
రోజూ కొన్ని నిమిషాలు చల్లటి నీటిలో కాళ్లు ఉంచడం వలన తాత్కాలిక ఉపశమనం కలగవచ్చు. అయితే, గట్టి ఐస్ నీరు వాడకూడదు. దీనివల్ల ఇది నరాలకు నష్టం కలిగించవచ్చు.
2.పోషకాహారాన్ని తీసుకోవడం:
విటమిన్ B12, B6, ఫోలిక్ యాసిడ్, ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కాళ్ళ మంటలను తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు బఠాణి, గుడ్లు, పాల ఉత్పత్తులు, పచ్చివెండికాయ, పాలక్, ఉల్లిపాయలు ఎక్కువగా తినాలి.
3.ఆల్కహాల్, పొగతాగుటకు విరమణ:
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కారణంగా నరాలు బలహీన పడతాయి. అలాంటి జీవనశైలిని, అలవాట్లను మార్చడం ద్వారా దీర్ఘకాలిక ఉపశమనం పొందవచ్చు.
4.మెడికేటెడ్ క్రీములు, ఆయింట్మెంట్లు:
డాక్టర్ సలహా మేరకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, న్యూరోపతిక్ క్రీములను రాత్రివేళ పాదాలపై సున్నితమైన మసాజ్ చేయడం వల్ల మంట తగ్గుతుంది.
5.సరైన వ్యాయామం, రక్త ప్రసరణ మెరుగుపరచడం:
ప్రతిరోజూ నడక, యోగా, పాద మసాజ్ ద్వారా కాళ్లకు సరైన రక్త ప్రసరణ ఉంటుంది. ఇది మంటను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
- మంట ఎక్కువ గంటల పాటు ఉండటం, తగ్గకపోతే.
- కాళ్లలో నొప్పి.
- రాత్రి సమయంలో ఎక్కువ మంట.
- తడిమితే స్పర్శ లేకపోవడం.
- గాయాలు త్వరగా మానకపోవడం.