కరోనా వైరస్ అంతమవుతుందా? మరింత ముదురుతుందా?

  • Publish Date - September 21, 2020 / 07:53 PM IST

Will coronavirus end: 1918నాటి స్పానిష్ ఫ్లూ ఎంతగా భయపెట్టిందో ఇంకా ప్రపంచానికి గుర్తుంది. ఈ coronavirus స్పానిష్ ఫ్లూ కన్నా తక్కువకాలంలోనే అంటే రెండేళ్లలోనే కట్టడి అవుతుందని ఆశిస్తోంది World Health Organisation అంటోంది.




మైక్రోసాఫ్ట్ కో‌ఫౌండర్ Bill Gates ఐతే, వచ్చే యేడాది చివరినాటికి కరోనాను పూర్తిగా తరిమికొట్టగలమని నమ్ముతున్నారు.

కరోనా అంతమవుతుందా?

కరోనా ఇంకా లక్షల సంఖ్యలోనే రోజూ పాజిటీవ్ కేసులు నమోదువుతున్నాయి. ఇంకా ఇండియాలాంటి దేశాల్లో పీక్‌కు వెళ్లలేదు. ఇంతలో రెండో వేవ్ వస్తోందంటూ ఇజ్రాయిల్, బ్రిటన్ లాక్‌డౌన్ చేస్తున్నాయి. ఈ సమయంలో ఎక్స్‌పర్ట్స్ నుంచి గుడ్‌న్యూస్ వినిపిస్తోంది.



త్వరలోనే మహమ్మారి పోతుంది. కాకపోతే తూడిచిపెట్టలేకపోవచ్చు.

వైట్ హౌస్ కరోనావైరస్ సలహాదారుడు Dr Anthony Fauci దృష్టిలో ఈ మూడు చేస్తే కరోనాను అడ్డుకట్టవేయొచ్చు.
1. ప్రభుత్వం తీసుకొనే ఆరోగ్య చర్యలు
2. ప్రపంచవ్యాప్తంగా herd immunity
3. మంచి వ్యాక్సిన్



ఈ మూడింటిని కలగలపితేనే కరోనాను నిర్మూలించగలమని డాక్టర్ ఫాసీ నమ్మతున్నారు. ఆయన ఉద్ధేశంలోనే వచ్చేయేడుకూడా కరోనాను పూర్తిగా తరిమికొట్టలేకపోవచ్చు. బహుశా 2023 వరకు టైం పట్టొచ్చు.



WHO చీఫ్ సైంటిస్ట్ Soumya Swaminathan ఉద్దేశంలో 2022వరకు అందరికీ వ్యాక్సిన్‌లను అందించలేం. అంటే అప్పటివరకు అందరూ జాగ్రత్తగానే ఉండాల్సిందే. WHO chief Tedros Adhanom Ghebreyesusకు మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు. ప్రపంచమంతాకలసి పనిచేస్తే వ్యాక్సిన్‌ను కనిపెట్టి, పంపిణి చేస్తే, రెండేళ్లలోనే కరోనాను పూర్తిగా తరిమికొట్టగలమని ధైర్యమిస్తున్నారు.



కాకపోతే కరోనా ఉంటుందా? లేక రెండేళ్లలో వెళ్తుందా? అన్న ప్రశ్నకు జవాబు Covid-19 treatment, vaccinesల మీదనే ఆధారపడింది. కంపెనీలు లాభాలు చూసుకొంటే కరోనా కట్టడి అసాధ్యమవుతుందన్నది మరో వాదన. ఇదికూడా నిజమే.


ట్రెండింగ్ వార్తలు