Honey Benefits : శీతాకాలంలో గొంతు నొప్పి, దగ్గు వంటి ఇన్ ఫెక్షన్స్ నుండి రక్షణ కలిగించే అమృతం ఇదే !

తేనెలో ఫినోలిక్ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్‌లతో సహా అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరంలో కణాలకు హాని కలిగించే రియాక్టివ్ ఆక్సిజన్ జాతులు (ROS), యాంటీఆక్సిడెంట్లతో పోరాడుతాయి.

Honey Benefits : శీతాకాలంలో గొంతు నొప్పి, దగ్గు వంటి ఇన్ ఫెక్షన్స్ నుండి రక్షణ కలిగించే అమృతం ఇదే !

honey

Honey Benefits : పురాతన కాలం నుండి ముడి తేనెను ఆయుర్వేదంలో ఔషధంగా పరిగణిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే తేనె పట్టుద్వారా పుట్టిన అమృతం. శరీరక దోషాలను పోగొట్టేందుకు ఇది సహాయపడుతుంది. చలికాలంలో ముడితేనె ను తీసుకోవటం వల్ల ఊపిరితిత్తులు, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. వేడివేడినీటిలో, టీ, కాఫీలలో తేనెను వేసుకోరాదు. ఎందుకంటే వేడికారణంగా ఆరోగ్యానికి హాని కలిగించే టాక్సిన్ ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల ఆరోగ్యానికి హానికలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గోరు వెచ్చగా ఉన్న వాటిలో మాత్రమే తేనెను వేసుకోవాలి.

READ ALSO : Benefits of honey for hair : తేనె రాస్తే జుట్టు తెల్లబడుతుందా? ఇందులో నిజమెంత..

శీతాకాలంలో, దగ్గు నుండి ఉపశమనం కలగాలంటే అల్లం రసంలో తేనె కలుపుకుని తీసుకుంటారు. సలాడ్ లపై ,టోస్ట్‌లు, పాన్‌కేక్‌ల పైన తేనెను వేసుకుని తింటారు. చక్కెరకు బదులుగా తృణధాన్యాలతో తయారు చేసే బార్ లలో తేనెను ఉపయోగించటం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఇన్ఫెక్షన్లను నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ముడి తేనె మంచి ఎంపిక. ఎందుకంటే ఇది విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.

టాక్సిన్స్‌ను తొలగించడం ద్వారా, చర్మం, జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. చర్మం ,జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Honey or Jaggery : తేనె లేదా బెల్లం ఈ రెండింటిలో మధుమేహ రోగులకు ఏది సురక్షితమైనది?

చలికాలంలో తేనె తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ;

గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించటంలో: శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గొంతు నొప్పి, దగ్గు వంటివి చలికాలంలో వచ్చే సాధరణ సమస్యలు. ఈ సమస్యల నుండి బయటపడాలంలే నిమ్మకాయ నీటిలో తేనె కలిపి తీసుకోవటం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించటానికి సాంప్రదాయ ఔషధంగా ఉపకరిస్తుంది.

మధుమేహం, వృద్ధాప్యం : తేనెలో ఫినోలిక్ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్‌లతో సహా అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరంలో కణాలకు హాని కలిగించే రియాక్టివ్ ఆక్సిజన్ జాతులు (ROS), యాంటీఆక్సిడెంట్లతో పోరాడుతాయి. టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు , అకాల వృద్ధాప్యంతో సహా అనేక పరిస్థితుల నుండి మనల్ని రక్షించంలో తేనె బాగా ఉపకరిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులైతే తేనెను తీసుకునే ముందు దయచేసి వైద్యుడిని సంప్రదించటం మంచిది. గ్లూకోజ్ స్థాయిని సరైన మోతాదును వైద్యులు సూచిస్తారు.

READ ALSO : Date Fruits With Honey : తేనెతో కలిపి ఖర్జూర పండ్లు ఉదయాన్నే తింటే ఎన్నో ప్రయోజనాలు!

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు : 40 ఏళ్లు పైబడిన 4,500 కంటే ఎక్కువ మంది పెద్దవయసు వారిపై జరిపిన ఒక అధ్యయనంలో తేనెను మితమైన మొత్తంలో తీసుకునే స్త్రీలకు అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. తేనె రక్తపోటును తగ్గించడానికి, హృదయ స్పందనను నియంత్రించడానికి, రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించటానికి, ఆరోగ్యకరమైన కణాల మరణాన్ని నిరోధించడానికి సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది.

రోగనిరోధక వ్యవస్థను బలపరిచేందుకు : తేనె తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఉదయం పరగడుపున తేనె తీసుకోవడం వల్ల అనారోగ్యాల బారి నుండి శరీరాన్ని రక్షించుకోవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

READ ALSO : Honey Benefits : ప్రతీరోజూ మన ఆహారంలో తేనెను భాగంగా చేసుకుంటే కలిగే లాభాలు ఇవే!

తేనె లో పుప్పొడి మరియు యాంటీఆక్సిడెంట్లు వంటి ఆరోగ్యకరమైన పదార్ధాలు ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. చక్కెరకు అద్భుతమైన ప్రత్యామ్నాయమైనప్పటికీ తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి. శరీరంపై చక్కెర ఎలాంటి ప్రభావాలను చూపిస్తుందో తేనె కూడా అలాంటి ప్రభావాలనే చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తేనె సైడ్ ఎఫెక్ట్స్ ;

తేనె ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. తేనె బోటులిజం ప్రమాదాన్ని కలిగిస్తుంది. బోటులిజం అనేది శరీరం యొక్క నరాలపై దాడి చేసే టాక్సిన్ వల్ల కలిగే తీవ్రమైన అనారోగ్యం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల పక్షవాతం , కొన్ని సందర్భాల్లో మరణానికి కారణమవుతుంది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.