గుజరాత్ మరణాలకు కారణం అవుతున్న వూహాన్ L- టైప్ కరోనా వైరస్

  • Publish Date - April 29, 2020 / 10:08 AM IST

వూహన్‌లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్.. ఈ జాతి వైరస్‌లలో 30రకాలు ఉన్నాయి. ఈ వైరస్ మన దేశంలో విస్తరిస్తుండగా.. గుజరాత్ రాష్ట్రంలో కూడా సెగలు పుట్టిస్తుంది. COVID-19 మరణాల రేటు కరోనా వైరస్  L- రకం జాతి కారణంగా ఎక్కువగా ఉండవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనాలోని వుహాన్‌లో వైరస్ వ్యాప్తి ప్రారంభవగా.. ప్రమాదకరమైన వైరస్ గుజరాత్‌లో విస్తరిస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు.

వుహాన్ 50 వేలకు పైగా కేసులు నమోదు కాగా, 3,800 వరకు మరణించారు. ఇప్పుడదే ఎల్ టైప్ వైరస్ గుజరాత్‌లోనూ వెలుగుజూసింది. గుజరాత్‌లో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను ‘ఎల్’ టైప్ కరోనా వైరస్‌ కాగా ఆ రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉండడానికి కారణం ‘ఎల్’ టైప్ వైరస్ అని నిపుణులు భావిస్తున్నారు. వ్యాప్తిలో ఉన్న ‘ఎస్’ టైప్ కరోనా వైరస్ కంటే ‘ఎల్’ టైప్ కరోనా వైరస్ శక్తిమంతమైనదని తమ పరిశోధనల్లో గుర్తించామని గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ (జీబీఆర్సీ) పరిశోధకులు చెబుతున్నారు. 

ఎస్-టైప్ వన్‌తో పోల్చితే మరింత వైరల్ ఎల్-టైప్ కరోనావైరస్ జాతి యొక్క ఆధిపత్యం రాష్ట్రంలో అధిక మరణాల రేటుకు కారణం అని వాళ్లు చెబుతున్నారు. ఇప్పటివరకు 133 మరణాలు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. దీనిని ధృవీకరించడానికి ఎటువంటి పరిశోధనలు నిర్వహించలేదని వారు వెల్లడించారు. విదేశాలలో శాస్త్రవేత్తలు చేసిన విశ్లేషణలో కరోనావైరస్ రోగులలో ఎక్కువ మరణాలు నమోదయ్యే చోట ఎల్-టైప్ స్ట్రెయిన్ ప్రబలంగా ఉన్నట్లు తేలింది. వుహాన్‌లో ఈ జాతి ఎక్కువగా ఉండేది.

గుజరాత్‌లో ఇప్పటివరకు 3,071 కేసులు నమోదు కాగా 133 మంది మరణించారు. ప్రమాద కారకాలలో 60 ఏళ్లు పైబడిన మరియు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రోగులు, మరియు గర్భిణీ స్త్రీలు ఉన్నట్లు అక్కడి ప్రిన్సిపల్ సెక్రటరీ(హెల్త్) జయంతి రవి చెప్పారు.