Bandi Sanjay slams Kcr
Bandi sanjay slams kcr: అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఇవాళ హైదరాబాద్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో మొజంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద జరిగిన ఘటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. వేదికపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నాయకుడు భగవంతరావు మాట్లాడుతుండగా స్థానిక టీఆర్ఎస్ నేత స్టేజీ మీదకు చేరుకొని మైకు లాక్కునే ప్రయత్నం చేసిన ఘటన సరికాదని అన్నారు.
హిమంతను మాట్లాడనివ్వకుండా మైక్ లాక్కోవడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అతిథులను గౌరవించడం సంస్కారమని అన్నారు. ప్రధాని మోదీని విమర్శించడానికి సీఎం కేసీఆర్ కు సిగ్గుండాలని చెప్పారు. కేసీఆర్ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పిస్తోందని అన్నారు.
అసోం సీఎంపై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతను అరెస్టు చేయాలని, హత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పారు. దాడికి పురిగొల్పిన వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. కేసీఆర్ కు హిందూ సమాజం బుద్ధి చెబుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలను చూస్తే టీఆర్ఎస్ నేతల వెన్నులో వణుకుపుడుతుందని ఆయన చెప్పారు. గణేశ నిమజ్జనం విషయంలోనూ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు.
EetelaRajender slams TRS: హైదరాబాద్‌లో అసోం ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం: ఈటల రాజేందర్