EetelaRajender slams TRS: హైదరాబాద్‌లో అసోం ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం: ఈటల రాజేందర్
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసోం ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. ఇటువంటి చర్యలు సరికాదని అన్నారు. గవర్నర్ తమిళిసైని కేసీఆర్ రెండేళ్ళుగా అవమానిస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అమాయకులు రాదని ప్రభుత్వ చర్యలను గమనిస్తున్నారని ఆయన చెప్పారు.

Etela Rajender Suspended
EetelaRajender slams TRS: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… అసోం ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. ఇటువంటి చర్యలు సరికాదని అన్నారు. గవర్నర్ తమిళిసైని కేసీఆర్ రెండేళ్ళుగా అవమానిస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అమాయకులు రాదని ప్రభుత్వ చర్యలను గమనిస్తున్నారని ఆయన చెప్పారు.
రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించారని, ఈ తీరు సరికాదని అన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇలా అపహాస్యం చేయవద్దని ఈటల రాజేందర్ అన్నారు. కాగా, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఇవాళ హైదరాబాద్ లో పర్యటించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మొజంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా వేదికపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నాయకుడు భగవంతరావు మాట్లాడుతుండగా స్థానిక టీఆర్ఎస్ నేత స్టేజీ మీదకు చేరుకొని మైకు లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీనిపైనే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bear Viral video: కారు డోరు తెరిచి లోపలికి వెళ్ళిన ఎలుగు బంటి.. వీడియో వైరల్