తెలంగాణపై బీజేపీ ఫోకస్ : రాజకీయంగా బలపడేందుకు వ్యూహాలు
తెలంగాణలో బీజేపీ గేమ్ మొదలుపెట్టిందా? అమిత్ షా ఆదేశాలను రాష్ట్ర నాయకులు అమల్లో పెట్టేస్తున్నారా? ప్రభుత్వం విధానాలను ఎండగట్టడంతోపాటు.. సర్కార్‌ని ఇరకాటంలో

తెలంగాణలో బీజేపీ గేమ్ మొదలుపెట్టిందా? అమిత్ షా ఆదేశాలను రాష్ట్ర నాయకులు అమల్లో పెట్టేస్తున్నారా? ప్రభుత్వం విధానాలను ఎండగట్టడంతోపాటు.. సర్కార్‌ని ఇరకాటంలో
తెలంగాణలో బీజేపీ గేమ్ మొదలుపెట్టిందా? అమిత్ షా ఆదేశాలను రాష్ట్ర నాయకులు అమల్లో పెట్టేస్తున్నారా? ప్రభుత్వం విధానాలను ఎండగట్టడంతోపాటు.. సర్కార్‌ని ఇరకాటంలో పెట్టడానికి కమలదళం కాచుకొని కూర్చుందా?.. అంటే… అవునన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. సంబంధిత శాఖలకు ఫిర్యాదులు చేయడం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం, కోర్టుల్లో కేసులు వేయడమే దీనిని నిదర్శనమన్న టాక్ వినిపిస్తోంది.
దక్షిణాదిలో కాషాయ జెండాను రెపరెపలాడించాలనుకుంటున్న బీజేపీ… ఇప్పటికే కర్ణాటకలో ఆ పనిని సక్సెస్ చేసింది. ఇపుడు తెలంగాణపై కన్ను వేసింది. ఇక్కడ తాము అధికారం చేపట్టడానికి ఎక్కువ అవకాశాలున్నాయని భావిస్తున్న ఆ పార్టీ అధినాయకత్వం… అందుకోసం పకడ్బందీగా అడుగులు వేస్తోంది. బెంగాల్ తరహాలో ప్రభుతాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్లాన్ గీసింది. దాని అమలు బాధ్యతను మాత్రం రాష్ట్ర నాయకత్వానికి అప్పగించింది.
మూడు నెలల కిందట రాష్ట్రానికి వచ్చిన కమలదళ అధిపతి అమిత్ షా ఇక్కడి రాజకీయల పరిస్థితులపై సుదీర్ఘ చర్చలు జరిపారు. స్థానిక నేతలకు కీలక సూచనలు చేశారు. అందులో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టడంతోపాటు… ఆయా శాఖలకు ఫిర్యాదులు చేయాలని, ఎప్పటికప్పుడు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని, అవసరమైతే కేసులు వేయాలని సూచించారు. స్టేట్ బీజేపీ లీడర్స్ కూడా సరిగ్గా దానినే ఫాలో అవుతున్నారు.
ఇంటర్మీడియట్ సమస్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంతోపాటు.. విద్యుత్ రంగంలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అంతేకాదు… తెలంగాణ మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని ఎంపీ బండి సంజయ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న కాషాయ దళం… సీబీఐ విచారణకు ఆదేశించాలని కూడా డిమాండ్ చేస్తోంది.
ఆర్టీసీ సమ్మెను కూడా కమలనాథులు తమకు అనుకులంగా మలుచుకోవాలని చూస్తున్నారు. దీనిపై ఇప్పటికే గవర్నర్‌ను కలిసి… కార్మికుల సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఆర్టీసీ భూముల లీజుల్లో అక్రమాలు జరిగాయని గళమెత్తుతున్నారు. ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉన్నవారికి ఆర్టీసీ భూములను అప్పనంగా అప్పగించిందని తమిళిసై దృష్టికి తీసుకెళ్లడంతోపాటు… ఈ ఇష్యూను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం ఏకంగా ఉద్యమం చేయడానికి సిద్ధమవుతోంది.
తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమంటున్న బీజేపీ… రాజకీయంగా బలపడేందుకు ఎన్నో ఎత్తులు వేస్తోంది. రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి గవర్నర్ రిపోర్ట్ ఇవ్వడం కూడా అందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా… తాము లేవనెత్తిన, ఫిర్యాదు చేసిన అంశాలను గవర్నర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్తుండటంతో ఇక్కడి లీడర్లలో జోష్ పెరిగింది. ఇదే స్పీడ్‌తో ప్రజా సమస్యలపై పోరాటాలకు సన్నద్ధమవుతోంది.