బ్రేకింగ్ : 25 నుంచి బడ్జెట్ సమావేశాలు 

  • Publish Date - February 8, 2019 / 04:22 PM IST

హైదరాబాద్ : తెలంగాణా బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. 2019 ఫిబ్రవరి 25 నుంచి 4 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఆర్ధిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఆదివారం కనుక కేబినెట్ విస్తరణ జరిగితే ఆర్ధిక మంత్రి బడ్జెట్ ను శాసనసభలో  ప్రవేశ  పెడతారు. లేని పక్షంలో సీఎం కేసీఆరే స్వయంగా బడ్జెట్ ను ప్రవేశ పెడతారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో జలగం వెంగళరావు వంటి వారు సీఎం హోదాలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కనుక సీఎం హోదాలో కేసీఆర్ బడ్డెట్ ప్రవేశపెడుతున్నారు.