సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. ఈ ఆఫర్లు తెలుసుకోండి

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. ఈ ఆఫర్లు తెలుసుకోండి

Updated On : May 31, 2024 / 1:11 PM IST

సంక్రాంతి పండుగ అంటేనే సొంతూరికి వెళ్లి సరదాగా పండుగ చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. అందుకే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ఫుల్లుగా కిక్కిరిసిపోతుంటాయి. మీరు కూడా అదే పనిలో ఉన్నారా.. ఆఫర్లు చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోలేమని నేరుగా బుకింగ్ కు వెళ్లిపోదామనుకుంటున్నారా.. మీ పని ఈజీ చేస్తూ మేమే మీ ముందు సమాచారాన్ని ఉంచాం..

redbus ఆఫర్లు:
తొలి యూజర్‌కు భారీ తగ్గింపు ఇస్తుంది రెడ్ బస్. ఏకంగా 250రూ తగ్గింపుతో ప్రయాణించొచ్చు. దీనికి చేయాల్సిందల్లా యాప్ డౌన్ లోడ్ చేసుకుని బుకింగ్ చేసుకునేటప్పుడు FIRST అనే కోడ్ వాడాలంతే. ఇంకా రెగ్యూలర్ యూజర్లు ఓలా మనీ నుంచి పే చేస్తే రూ.75నుంచి రూ.500వరకూ క్యాష్ బ్యాక్ పొందొచ్చు.

* amazon pay నుంచి పేమెంట్ చేస్తే రూ.10నుంచి రూ.300వరకూ
* నేరుగా red bus నుంచి పేమెంట్ చేసేటప్పుడు SUPERDEAL అనే కోడ్ వాడితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యూజర్లు ఎవరైనా రూ.150తగ్గింపు పొందొచ్చు.
* RTC టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో RTCఅనే కోడ్ వాడి రూ.100తగ్గించుకోవచ్చు.
* ఇంకా TWENTY20 అనే కోడ్ వాడి 12శాతం గరిష్టంగా రూ.200, NEWYEARఅనే కోడ్ వాడి 10శాతం అంటే గరిష్ఠంగా రూ.150పొందొచ్చు.

mobikwik, freechargeల నుంచి టిక్కెట్ బుక్ చేసినా.. పేమెంట్ చేసినా: 
mobikwik నుంచి చెల్లిస్తే 20శాతం అంటే దాదాపు రూ.200వరకూ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. freecharge యాప్ నుంచి అమౌంట్ పే చేస్తే చేసుకుని రూ.50 పొందగలం.

అదిరిపోయే ఆఫర్లతో Paytm:
* Paytm కూడా అద్భుతమైన ఆఫర్లు అందిస్తుంది. ఫస్ట్ టిక్కెట్ బుక్ చేసుకునే వారికి రూ.200క్యాష్ బ్యాక్ అందిస్తుంది. దీనికి చేయాల్సిందల్లా టిక్కెట్ చేసుకునేటప్పుడు FIRSTRIDEఅని కోడ్ ఎంటర్ చేయాలంతే.
* BUSSANKRANTI అనే కోడ్‌తో 15శాతం క్యాష్ బ్యాక్ దాదాపు రూ.300వరకూ పొందగలం.
* రూ.1000అంతకంటే ఎక్కువ డబ్బుతో టిక్కెట్ బుక్ చేయాలనుకునే వారు BUSROUNDTRIP అని ఎంటర్ చేసి రూ.200క్యాష్ బ్యాక్ సంపాదించుకోవచ్చు.
* ఇద్దరి కంటే ఎక్కువ ప్రయాణికుల కోసం స్పెషల్ గా RIDETOGETHERఅనే కోడ్ ఎంటర్ చేసి రూ.250 క్యాష్ బ్యాక్ సంపాదించుకోవచ్చు.
* చాలా కాలంగా ఉన్న FREERTC ప్రొమో కోడ్‌ను సవరిస్తూ 6శాతం అంటే గరిష్ఠంగా రూ.100 క్యాష్ బ్యాక్ వస్తుంది.

ఇంకెందుకు ఆలస్యం.. బుక్ చేస్కోండి క్యాష్ బ్యాక్ దక్కించుకోండి.