కర్ణాటక సీఎం కుమారస్వామితో మాట్లాడిన కేసిఆర్

  • Publish Date - May 3, 2019 / 07:23 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కర్ణాటక సీఎం కుమారస‍్వామితో ఫోన్‌లో మాట్లాడారు. జూరాల ప్రాజెక్ట్‌కు నీటి విడుదలపై కేసిఆర్ . జూరాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేసీఆర్‌ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కుమారస్వామి ప్రభుత్వం.. ఒకటి, రెండు రోజుల్లో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వేసవిలో తాగునీటి జూరాలపై ఆధారపడ్డ పాలమూరు గ్రామాలకు తాగునీటి కోసం ముఖ్యమంత్రి కర్ణాటక సర్కారుకు వినతి చేశారు. అదేవిధంగా తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి కర్ణాటక సీఎస్‌కు లేఖ రాశారు. త్రాగునీటి కోసం నీటిని విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేశారు.