బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్

2019-20 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ చదివి వినిపిస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టేకంటే ముందు పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్లకు సంతాపం తెలియజేశారు. అమర జవాన్లకు నివాళి అనంతరం సభకు టీ విరామం ప్రకటించారు.
వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి సీఎం బెజవాడ గోపాల్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానంద రెడ్డి, రోశయ్య ముఖ్యమంత్రులుగా ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టారు. వారి తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నది సీఎం కేసీఆరే. స్వరాష్ట్రంలో బడ్జెట్ ప్రసంగం చేసిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు సృష్టించారు.
గతంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేకూరేలా సంక్షేమ పధకాలు గత నాలుగున్నరేళ్ళలో అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించామని ఆయన చెప్పారు. వృధ్దులకు ,వితంతువలకు, వికలాంగులకు ఇచ్చే పించన్ ను పెంచామని కేసీఆర్ తెలిపారు. రూపాయికి కిలో బియ్యం చొప్పున నెలకు ఒక్కోక్కరికి 6 కిలోల చొప్పను ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. మరోవైపు శాసనమండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Read Also: ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.25లక్షల సాయం : సీఎం కేసీఆర్
Read Also: గుండెల్ని పిండేసే ఘటన : అమర జవానుకు భార్య చివరి ముద్దు
Read Also: సినిమా రివ్యూ : ఎన్టీఆర్ మహానాయకుడు