దిశ నిందితుల ఎన్ కౌంటర్ : తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు : పూనం కౌర్

  • Published By: veegamteam ,Published On : December 6, 2019 / 05:36 AM IST
దిశ నిందితుల ఎన్ కౌంటర్ : తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు : పూనం కౌర్

Updated On : December 6, 2019 / 5:36 AM IST

దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులకు నటి పూనమ్ కౌర్ కృతజ్ఞతలు తెలిపారు. దిశ నిదితుల్ని ఎన్ కౌంటర్ చేయటం అభినందనీయమని ఆమె సంతోషం వ్యక్తంచేశారు. దిశ ఘటన తెలిసి తానుఎంతో ఆవేదన చెందాననీ.. ఆందోళన చెందానని కానీ.. నిందితులకు ఇంత త్వరగా శిక్ష వేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడినవారికి ఇదే సరైన శిక్ష అని అన్నారు. ఇక ఏ ఆడపిల్లకు ఇటువంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులకు..ప్రభుత్వాలకు ఉందన్నారు.

దిశ ఘటన తరువాత పూనమ్ కౌర్ ఎంతో ఆవేదన వ్యక్తంచేశారు. వీడియో రూపంలో తన ఆవేదనను వ్యక్తంచేశారు. కన్నీటితో దోషులపై, పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ దుర్మార్గుల్ని చంపి జైలుకు వెళతానని కూడా అన్నారు.

ఇటువంటి ఘటనల గురించి వింటుంటే.. కడుపు రగిలిపోతోందనీ… ఆడవాళ్లంతే ఆటబొమ్మలా ఇష్టమొచ్చినట్లుగా వారి శరీరాలతో ఆడుకోవటానికి అంటూ తీవ్ర ఆవేదనను వ్యక్తంచేశారు. ఈక్రమంలో దిశ ఘనట జరగిన సరిగ్గా 10 రోజులకు నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేయటంపై ఆమె సంతోషాన్ని వ్యక్తంచేశారు. ఇటువంటి నరరూప రాక్షసులకు ఇదే సరైన శిక్ష అన్నారు.

దిశ నిందుతల ఎన్ కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. సామాన్య ప్రజలే కాక..ప్రముఖులు..ప్రజా ప్రతినిధులు కూడా ఈ ఎన్ కౌంటర్ ను హర్షిస్తున్నారు.కామాంధుల చేతుల్లో బలైపోయిన దిశ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. తెలంగాణలో జరిగిన ఈ దారుణంపై దేశం యావత్తు కన్నీరు పెట్టింది. 10 రోజుల క్రితం జరిగిన ఈ కిరాతక చర్యకు దేశ ప్రజలంతా నిందితుల్ని దారుణంగా చంపాలనీ.. ఉరి తీయాలనీ..దిశను చంపినచోటే.. ఆమెను చంపినట్లే చంపాలనే డిమాండ్లు వినిపించాయి.

దిశ ఘటనతో యువతులు..మహిళలతో పాటు పురుషులు కూడా తీవ్ర ఆగ్రహావేశాల్ని వ్యక్తంచేశారు. ఇటువంటి మావన మృగాలు సమాజంలో బ్రతకటానికి వీల్లేదని..ఇటువంటివారిని జైళ్లలో పెట్టి పోషించటం..విచారణ పేరుతో కాలయాపన చేయవద్దని ఎన్ కౌంటర్ చేయాలని సమాజం నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది.

అదే జరిగింది…! దిశ ఘటన జరిగిన సరిగ్గా 10 రోజులకు నిందుతులు నలుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. సమాజం నుంచి ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తంమయ్యాయి. సంతోషంగా పలు ప్రాంతాల ప్రజలు దీపావళికి జరుపుకున్నట్లుగా టపాసులు కాల్చుకుని తమ సంతోషాలను వ్యక్తంచేశారు. పోలీస్ జిందాబాద్ అంటూ తెలంగాణ పోలీసుల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.