Better Birthing Experience : మహిళల్లో నార్మల్ డెలివరీ పట్ల అవగాహన పెంచేందుకు భాగ్యనగరంలో ప్రత్యేక సదస్సు

మహిళల్లో నార్మల్ డెలివరీలపై అవగాహన పెంచేందుకు హైదరాబాద్‌లో ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు జరిగింది. బెటర్ బర్తింగ్ ఎక్స్ పీరియన్స్ పేరుతో జరిగిన ఈ సదస్సులో ప్రముఖ డాక్టర్లు, ఫారిన్ డెలిగేట్స్ పాల్గొన్నారు.

Better Birthing Experience : మహిళల్లో నార్మల్ డెలివరీల పట్ల అవగాహన పెంచేందుకు భాగ్యనగరంలో ‘బెటర్ బర్తింగ్ ఎక్స్‌పీరియన్స్’ పేరుతో ప్రత్యేక సదస్సు జరిగింది. ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషన్స్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకి పెద్ద సంఖ్యలో గైనకాలజిస్టులు, నర్సులు, ఫారిన్ డెలిగేట్స్ హాజరయ్యారు.

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు.. ఒక్క రోజే 5.47 లక్షల మంది ప్రయాణం

ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషన్స్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రత్యేక సదస్సు జరిగింది. బేగంపేటలోని హోటల్ మేరిగోల్డ్‌లో జరిగిన సదస్సుకి పెద్ద ఎత్తున గైనకాలజిస్టులు, ప్రసూతి డాక్టర్స్, నర్పులు, చైల్డ్ కేర్ ఎడ్యుకేటర్స్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్ 270 మందికి పైగా డెలిగేట్స్ హాజరయ్యారు.  ఈ కాన్ఫరెన్స్‌లో దేశంలో పెరుగుతున్న సిజేరియన్ డెలివరీలు, నేచురల్ డెలివరీలు పెంచేందుకు వైద్య విధానాల్లో వస్తున్న మార్పులపై చర్చించారు.

IT Raids: హైదరాబాద్ లో ఐటీ దాడులు.. 10 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు

రెండురోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో మొదటిరోజు గర్భిణీ స్త్రీలలో మెడికల్ ప్రాబ్లమ్స్ రాకుండా నార్మల్ డెలివరీని ప్రోత్సహిస్తూ వైద్య విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చలు జరిపారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవ సమయంలో గర్భిణీకి ఎలాంటి సాయం అవసరం? డిఫరెంట్ పొజిషన్స్‌లో డెలివరీ ఎలా చేయవచ్చును? లేబర్ రూమ్‌లోకి భర్త లేదా కుటుంబ సభ్యులను అనుమతించడం..నొప్పులు వస్తున్న సమయంలో గర్భిణీలు ఆందోళన చెందకుండా వారికి ఇవ్వాల్సిన మెంటల్ సపోర్ట్.. వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి.

 

ట్రెండింగ్ వార్తలు