Ganesh idol stolen in Hyderabad: హైదరాబాద్‌లో గణేశుడి విగ్రహాన్ని చోరీ చేసిన ముగ్గురు యువకులు.. వీడియో వైరల్

గణేశుడి విగ్రహాల చేతుల్లో పెట్టిన లడ్డును, ఇతర ప్రసాదాన్ని కొందరు చోరీ చేసి తినడం హైదరాబాద్‌లో సాధారణమే. అయితే, ఇప్పుడు వినాయకుడి విగ్రహాలనూ కొట్టేస్తున్నారు కొందరు. తాజాగా హైదరాబాద్‌లో రోడ్డు పక్కన అమ్మకానికి ఉంచిన గణేశుడి విగ్రహాన్ని కొందరు యువకులు చోరీ చేశారు. ఇందుకు సంబంధించి వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. హయత్ నగర్‌లో రాత్రి సమయంలో రోడ్డు పక్కన గణేశుడి విగ్రహాలను అమ్మకానికి పెట్టారు. అందులో ఒకదాన్ని ముగ్గురు యువకులు కొట్టేశారు.

Ganesh idol stolen in Hyderabad

Ganesh idol stolen in Hyderabad: గణేశుడి విగ్రహాల చేతుల్లో పెట్టిన లడ్డును, ఇతర ప్రసాదాన్ని కొందరు చోరీ చేసి తినడం హైదరాబాద్‌లో సాధారణమే. అయితే, ఇప్పుడు వినాయకుడి విగ్రహాలనూ కొట్టేస్తున్నారు కొందరు. తాజాగా హైదరాబాద్‌లో రోడ్డు పక్కన అమ్మకానికి ఉంచిన గణేశుడి విగ్రహాన్ని కొందరు యువకులు చోరీ చేశారు. ఇందుకు సంబంధించి వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. హయత్ నగర్‌లో రాత్రి సమయంలో రోడ్డు పక్కన గణేశుడి విగ్రహాలను అమ్మకానికి పెట్టారు.

గణేశుడి విగ్రహాలు ఎవరు ఎత్తుకుపోరులే అనుకుని అమ్మకందారులు రాత్రి సమయంలో రోడ్డు పక్కనే వాటిని ఉంచి వెళ్ళారు. అదే సమయానికి అక్కడకు వచ్చిన ముగ్గురు యువకులు ఓ గణేశుడి విగ్రహాన్ని చోరీ చేశారు. గణేశుడి విగ్రహాన్ని చేతులపై ఎత్తుకుని వారు ముగ్గురు వెళ్ళిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రోడ్డు దాటాక ఆ విగ్రహాన్ని ఆటో-ట్రాలీలో వారు తీసుకు వెళ్ళారు.

ఆ విగ్రహాన్ని డబ్బులు లేక ఎత్తుకు వెళ్ళారా? లేదా ఇక్కడి నుంచి చోరీ చేసి తీసుకెళ్ళిన ఆ విగ్రహాన్ని వేరే ప్రాంతంలో అమ్మి డబ్బు సంపాదించుకోవడానికి తీసుకు వెళ్ళారా అన్న విషయం తెలియరాలేదు. ఆ ఘటనపై తాము సమాచారం అందుకున్నామని, అయితే, దీనిపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు.

COVID-19: దేశంలో కొత్తగా 7,231 కరోనా కేసులు.. నిన్న 22,50,854 వ్యాక్సిన్ డోసుల వినియోగం