ఊరెళ్తున్నారా…ఇళ్ళు జర భద్రం

సంక్రాంతి పండగొస్తే అందరికి పండుగే. దొంగలకు అయితే ఇంకా పెద్ద పండుగ. ఎందుకు అంటారు. ఈ పండుగకే కదా.. ఇళ్లకు తాళాలు వేసి సొంతూళ్లుకు పయనమయ్యేది. దొంగలు దర్జాగా దొంగతనాలు చేసేందుకు ఇదే సరైన సమయం.

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 05:57 AM IST
ఊరెళ్తున్నారా…ఇళ్ళు జర భద్రం

సంక్రాంతి పండగొస్తే అందరికి పండుగే. దొంగలకు అయితే ఇంకా పెద్ద పండుగ. ఎందుకు అంటారు. ఈ పండుగకే కదా.. ఇళ్లకు తాళాలు వేసి సొంతూళ్లుకు పయనమయ్యేది. దొంగలు దర్జాగా దొంగతనాలు చేసేందుకు ఇదే సరైన సమయం.

హైదరాబాద్: సంక్రాంతి పండగొస్తే అందరికి పండుగే. దొంగలకు అయితే ఇంకా పెద్ద పండుగ. ఎందుకు అంటారు. ఈ పండుగకే కదా.. ఇళ్లకు తాళాలు వేసి సొంతూళ్లుకు పయనమయ్యేది. దొంగలు దర్జాగా దొంగతనాలు చేసేందుకు ఇదే సరైన సమయం. అందుకే ఊరెళ్లే ముందు జర జాగ్రత్త అంటున్నారు పోలీసోళ్లు. ఇంటికి తాళం వేశాము కదా? ఎవరూ వస్తారులే అనుకుంటే అంతే సంగతులు.. వచ్చేసరికి మీ ఇళ్లు గుల్ల చేసేస్తారు దొంగోళ్లు. ఊరేళ్లే తొందరలో ఇంటికి తాళం వేయడమే కాదు.. కాస్తా పోలీసులకు కూడా సమాచారం ఇవ్వండి.. అలాగే పోలీసులు చెప్పే సూచనలు, జాగ్రత్తలు పాటించండి.. అప్పుడే దొంగల బారి నుంచి ఇళ్లలోని విలువైన వస్తువులు, ఆభరణాలు భద్రంగా ఉంటాయని పోలీసులు భరోసా ఇస్తున్నారు. అంతేకాదు కాలనీలు, అపార్టుమెంట్లలో నివాసముంటూ ఇళ్లకు తాళాలు వేసి కుటుంబం మొత్తం ఊరు వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటే ముందుగానే కనీస జాగ్రత్తలు పాటించాలని మలక్‌పేట డివిజన్ ఏసీపీ మంత్రి సుదర్శన్ చెబుతున్నారు. ఇంటికి తాళాలు వేసి ఊరెళ్లిన వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదుచేసుకుని వారి ఇంటిపై పోలీసుల ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తారని తెలిపారు. సంక్రాంతి పండుగ ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేంత వరకు దొంగతనాలు జరుగకుండా పోలీసు నిఘాను ఏర్పాటుచేసి అవసరమైన చర్యలు తీసుకుంటారని సుదర్శన్ తెలిపారు. 

 ఊరెళ్లే ముందు పాటించాల్సిన జాగ్రత్తలు.. 
– బంగారు, వెండీ, నగదు, విలువైన ఆభరణాలు, వస్తువులను ఇళ్లలో ఉంచరాదు. వాటిని బ్యాంకుల్లో భద్రపర్చుకోవాలి. 
– బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి.
– కాలనీల్లో అనుమానాస్పదంగా తిరిగే వారిపై స్థానికులు నిఘా పెట్టాలి.
– ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటివారికి ఇంటి పరిసరాలను గమనించమని చెప్పాలి.
– ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు.
– ఊరు వెళ్లే వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి.
– ఏమైనా నేరాలు జరిగితే అనుమానిత వ్యక్తుల కదలికలు తెలిపేందుకు ఈ నంబర్ కు 9490616380 ఫోన్ చేసి సమాచారం అందించాల్సిందిగా ప్రజలకు సూచించారు.