K.T.Rama Rao On freebies: పేదలకు ఇస్తే ‘ఉచితాలు’.. పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా?

ఎన్నికల సమయంలో ప్రకటిస్తోన్న 'ఉచితాల'పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉచితాలు వద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా ఉచితాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఉచితాలు’ ఎందుకు వద్దంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఇదే ప్రశ్న వేశారు. ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై కేటీఆర్ పత్రికా ప్రకటన చేశారు. పేదల సంక్షేమ పథకాలపై ప్రధాని మోదీకి ఎందుకంత అక్కసు అని ఆయన నిలదీశారు.

K.T.Rama Rao On freebies: ఎన్నికల సమయంలో ప్రకటిస్తోన్న ‘ఉచితాల’పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉచితాలు వద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా ఉచితాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఉచితాలు’ ఎందుకు వద్దంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఇదే ప్రశ్న వేశారు. ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై కేటీఆర్ పత్రికా ప్రకటన చేశారు. పేదల సంక్షేమ పథకాలపై ప్రధాని మోదీకి ఎందుకంత అక్కసు అని ఆయన నిలదీశారు.

ప్రధాని మోదీ దృష్టిలో ఉచితాలంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు. పేదలకు ఇస్తే ‘ఉచితాలు’ ఇవ్వడం తప్పు అంటూ.. పెద్దలకు మాత్రం ప్రోత్సాహకాలు ఇస్తున్నారని ఆయన అన్నారు. పేదలకు ఇచ్చేవాటిని ‘ఉచితాలు’ అని, పారిశ్రామిక వేత్తలకు ఇచ్చేవి ప్రోత్సాహకాలు అని అనడం ఏంటని నిలదీశారు. కాకులను కొట్టి గద్దలను వేయడమే మోదీ విధానమా? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అంటే చేదు… కార్పొరేట్ రుణమాఫీ అంటే ముద్దా? అని కేటీఆర్ అడిగారు.

నిత్యావసరాల మీద జీఎస్టీ బాదుతున్నారని, కార్పొరేట్లకు మాత్రం పన్నురాయితీలు ఇస్తున్నారని విమర్శించారు. 80 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఎవరిని ఉద్ధరించారని ఆయన నిలదీశారు. ప్రధాని మోదీకి దేశ సంపదను పెంచే తెలివి లేదని విమర్శించారు. సంపదను పెంచి పేదల సంక్షేమానికి ఖర్చు చేసే మనసు లేదని అన్నారు. కాగా, సమసమాజం కోసం ఉచితాలు ఇవ్వడం సరైనదేనంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. పేదలకు ఉచితాలు ఇవ్వడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని వాదిస్తోంది.

Weather alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

ట్రెండింగ్ వార్తలు