Weather alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప‌డిందని విశాఖ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెప్పారు. రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. అలాగే, రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంద‌ని వివ‌రించారు.

Weather alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Weather alert

Weather alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప‌డిందని విశాఖ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెప్పారు. రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. అలాగే, రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంద‌ని వివ‌రించారు. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు చెప్పారు.

రాగల రెండు రోజుల పాటు ఉత్తరకోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయ‌ని చెప్పారు. ఇటీవ‌ల తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డ విష‌యం తెలిసిందే. రెండురోజులుగా వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. మ‌ళ్ళీ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెప్పారు.

Komatireddy Venkat Reddy: రేవంత్ సారీ‌పై స్పందించిన వెంకట్‌రెడ్డి.. అతన్ని సస్పెండ్ చేశాకే ఆలోచిస్తానని వెల్లడి