తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో మరింత టెంపరేచర్స్ పెరుగుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు.
మరోవైపు రానున్న నాలుగు రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక మే 09వ తేదీ గురువారం సాధారణం కన్నా 6.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో 45.6 డిగ్రీలు, నల్గొండలో 45.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.