శాల్వలు..బోకేలు వద్దు..మొక్కలు నాటండి – మంత్రి కేటీఆర్

  • Published By: madhu ,Published On : September 8, 2019 / 02:28 PM IST
శాల్వలు..బోకేలు వద్దు..మొక్కలు నాటండి – మంత్రి కేటీఆర్

Updated On : September 8, 2019 / 2:28 PM IST

తనకు మంత్రి పదవి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సెప్టెంబర్ 08వ తేదీ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. కొత్తగా ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. మంత్రివర్గంలో కేటీఆర్‌కు ఛాన్స్ దక్కింది. ఆయనకు పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, మైనింగ్, ఐటీ శాఖ కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. 

ఈ సందర్భంగా కేటీఆర్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. తనకు సందేశాలు పంపించినందుకు..శుభాకాంక్షలు తెలియచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. కానీ..తనను అభినందించడానికి వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఎలాంటి పుష్పగుచ్చాలు, శాల్వలు తీసుకరావద్దని సూచించారు. దీని బదులుగా ఒక్క మొక్కను నాటాలని, లేదా CMRFకి విరాళం ఇవ్వాలని ట్వీట్ చేశారు. 

ఇక KTR విషయానికి వస్తే… సిరిసిల్ల ఎమ్మెల్యే. సీఎం కేసీఆర్‌ తనయుడు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. ఇలా… పలు రకాల బాధ్యతల్ని విజయవంతంగా నడిపిస్తున్న మల్టీ టాలెంటెడ్‌ లీడర్‌. 2008 నుంచి మొన్నటి ఎన్నికల దాకా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కేటీఆర్‌. 2008, 2009, 2014, 2018లో విజయం సాధించారు. సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఈ యువ నేత… తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. హరీష్‌రావుతో కలిసి ఉద్యమానికి ఉరకలెత్తించారు.
Read More : తెలంగాణ కేబినెట్ విస్తరణ : ఆరుగురు మంత్రుల ప్రమాణ స్వీకారం
టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు కేటీఆర్‌. ఐటీ శాఖతో పాటు చేనేత శాఖలకు గుర్తింపు తీసుకొచ్చారు. ముఖ్యంగా కేటీఆర్‌ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థల్ని రాష్ట్రానికి తీసుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ పేరును నిలబెట్టారు. కీలక సదస్సుల్ని హైదరాబాద్‌ నగరంలో నిర్వహించారు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అలాగే జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఘన విజయం అందించి మాస్‌ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం తర్వాత… టీఆర్‌ఎస్‌ వర్కిండ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతల్ని తీసుకున్నారు కేటీఆర్‌. అప్పట్నుంచీ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.