Hyderabad Traffic: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇక కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌ వే.. పోలీసుల కీలక సూచనలు

హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్క్ చుట్టూ నూతన వన్ వే ట్రాఫిక్ నిబంధనల అమలుపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic) ప్రత్యేక శ్రద్ధ వహించారు.

Hyderabad traffic police announce one way rules around kbr park

  • కేబీఆర్ పార్క్ వద్ద వన్‌వే
  • ఈనెల 18 నుంచి అమలు
  • వాకర్లతో ట్రాఫిక్ పోలీసుల చర్చ

Hyderabad Traffic: హైదరాబాద్‌లోని ప్రముఖ కేబీఆర్‌ పార్క్ చుట్టూ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదించిన నూతన వన్ వే ట్రాఫిక్ నిబంధనల అమలుపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈనెల 18 నుంచి అమల్లోకి రానున్న ఈ ట్రాఫిక్ మార్పుల విధానంపై పార్క్ వాకర్లకు స్పష్టతనిచ్చేందుకు శుక్రవారం ఉదయం అధికారులతో బహిరంగ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. కేబీఆర్ పార్క్ సందర్శకులు, వాహనదారులు ఈ నూతన విధానానికి పూర్తి సహకారం అందించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తోడ్పడాలని కోరారు.

Delhi Bomb Threat: స్వాతంత్ర్య దినోత్సవ వేళ తీవ్ర ఉద్రిక్తత.. ఢిల్లీలో బాంబు హెచ్చరికలు.. రంగంలోకి భద్రతా దళాలు

వాకర్లకు పోలీసుల కీలక సూచనలు, నిబంధనలు:

ఈ చర్చా సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic)వాకర్లకు పలు కీలక సూచనలు చేశారు. వాహనాలను కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో, మల్టీ-లెవల్ పార్కింగ్ సదుపాయంలోనే నిలపాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై నిలపకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో రోడ్డుకు ఎదురుగా రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం తీవ్ర ప్రమాదకరమని హెచ్చరించారు. ట్రాఫిక్ నిర్వహణను సులభతరం చేసేందుకు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి సహకరించాలని ఈ సందర్బంగా సూచించారు.

క్యూఆర్ కోడ్‌తో ప్రజల అభిప్రాయాల స్వీకరణ:

ఈ నూతన నిబంధనలపై వాకర్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు పార్క్ వద్ద ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌ బ్యాక్‌ను పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తామని కూడా తెలిపారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, డీసీపీ కాజల్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొని సందర్శకుల అనుమానాలను నివృత్తి చేశారు.