Hyderabad Traffic Alert: వాహనదారులు అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్స్ లో అస్సలు వెళ్లకండి!

హైదరాబాద్‌లో రేపు నిర్వహించనున్న కార్యక్రమాల దృష్ట్యా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్(Hyderabad Traffic Alert) పోలీసులు ముందస్తు ఆంక్షలు విధించారు.

Hyderabad traffic police issue advisory and route diversions

  • రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
  • ట్యాంక్‌బండ్ మార్గంలో దారి మళ్లింపులు
  • ప్రత్యామ్నాయ దారులు ఎంచుకోవడం ఉత్తమం

Hyderabad Traffic Alert: రాజధాని హైదరాబాద్‌లో రేపు నిర్వహించనున్న విభిన్న కార్యక్రమాల దృష్ట్యా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ముందస్తు ఆంక్షలు విధించారు. ధర్నా చౌక్ వద్ద దివ్యాంగులు, రైతులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ‘మహా ధర్నా’తో పాటు పాదయాత్ర జరగనుంది. దీనికితోడు పాత అంబేడ్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ కూడా ఉండటంతో నగరంలోని ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పలు కీలక కూడళ్లలో అవసరాన్ని బట్టి ట్రాఫిక్ (Hyderabad Traffic Alert)మళ్లింపులు అమలు చేయనున్నారు.

Ap Rain Alert: అమరావతికి ఆరెంజ్ అలర్ట్.. రాబోయే 3 గంటలు అత్యంత కీలకం.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు!

మహా ధర్నా, పాదయాత్ర మార్గాల్లో ఆంక్షలు:

ధర్నా చౌక్ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఇందిరా పార్క్ ఎక్స్ రోడ్, ఆర్‌కే మఠం, కట్టమైసమ్మ ఆలయం మీదుగా పాత అంబేడ్కర్ విగ్రహం వరకు కొనసాగనుంది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. నల్లకుంట నుంచి స్టీల్ బ్రిడ్జ్ వైపు వచ్చే వాహనాలను కట్టమైసమ్మ వైపు అనుమతించరు. వీటిని అజామాబాద్ ఎక్స్ రోడ్ వద్ద విఎస్టి వైపు మళ్లిస్తారు. అలాగే ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి ఇందిరా పార్క్ వైపు వచ్చే వాహనాలను కూడా ప్రత్యామ్నాయ దారుల్లోకి మళ్లించనున్నారు.

ట్యాంక్‌బండ్ పరిసరాల్లో మళ్లింపులు.. ప్రత్యామ్నాయ దారులు ఉత్తమం:

అశోక్‌నగర్ ఎక్స్‌రోడ్స్ వద్ద వాహనాలను హిమాయత్‌నగర్ స్ట్రీట్ నెం.8, బకారం బ్రిడ్జ్ వైపు మళ్లిస్తారు. కర్బలా నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ, గాంధీనగర్ టీ జంక్షన్, DBR మిల్స్ మీదుగా లోయర్ ట్యాంక్‌బండ్ వైపు పంపుతారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభ పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. కాబట్టి ప్రయాణికులు ఈ విషయాలను గమనించి, తగిన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.