Ap Rain Alert: అమరావతికి ఆరెంజ్ అలర్ట్.. రాబోయే 3 గంటలు అత్యంత కీలకం.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్(Ap Rain Alert) రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల ప్రజలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
Ap disaster management issues orange alert heavy rain and lightning in amravati
- నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- పిడుగులతో కూడిన భారీ వర్షాలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Ap Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల ప్రజలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అనుహ్యంగా మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అత్యవసర ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల వ్యవధిలో పలు ప్రాంతాలలో వాతావరణం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని, ప్రధానంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ ఆకస్మిక మార్పుల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు, ప్రయాణికులు తీవ్ర జాగ్రత్తలు వహించాలని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.
Nara Lokesh: 2029 నాటికి మరో 3 DSC నోటిఫికేషన్లు.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి:
ప్రత్యేకంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఈ హెచ్చరికలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి, అమరావతి, ఉయ్యూరు తదితర కీలక ప్రాంతాలలో అక్కడక్కడా బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే తీవ్ర అవకాశం ఉందని హెచ్చరించారు. ఆకస్మిక వర్షాల(Ap Rain Alert) వల్ల రోడ్లపై నీరు నిలిచే ప్రమాదం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేసింది.
