Independence Celebrations: రేపటినుంచే స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8-22 వరకు ఈ వేడుకలు జరుగుతాయి.

Independence Celebrations: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8-22 వరకు ఈ వేడుకలు జరుగుతాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఉదయం 11.30 గంటలకు ఈ ఉత్సవాల్ని ఘనంగా ప్రారంభిస్తారు.

ISRO Satellites: నిరుపయోగంగా శాటిలైట్లు.. ఇస్రో ప్రకటన

దీనికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర అధికారులు ఆదివారం పరిశీలించారు. కార్యక్రమంలో ముందుగా సీఎం కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం దేశభక్తి ఉట్టిపడే విధంగా వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, జెడ్పిటీసీలు, ఎంపిపిలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ప్రతి ఒక్కరికీ ఇప్పటికే ప్రత్యేక పాసులు జారీ చేశామని అధికారులు చెప్పారు. జిల్లాల నుంచి వచ్చే జెడ్పిటీసీలు, ఎంపిపిలకు నేరుగా రావడానికి ప్రత్యేకంగా వాహన సదుపాయాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

Ramayana: రామాయణంపై క్విజ్.. ముస్లిం విద్యార్థుల విజయం

కార్యక్రమంలో భాగంగా 75 మంది వీణ కళాకారులచే దేశ భక్తి గీతాల వాయిద్య ప్రదర్శన, స్వతంత్ర సమర యోధులను తలుచుకునే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఫ్యూజన్ డాన్స్ వంటి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. లేజర్ షో ప్రత్యేకాకర్షణగా నిలవనుంది.

 

ట్రెండింగ్ వార్తలు