ISRO Satellites: నిరుపయోగంగా శాటిలైట్లు.. ఇస్రో ప్రకటన

ఆదివారం ఉదయం చేపట్టిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1 ప్రయోగం విఫలమైందని అధికారికంగా ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఈ రాకెట్‌ మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాలు ఇకపై నిరుపయోగంగా ఉంటాయని తెలిపింది.

ISRO Satellites: నిరుపయోగంగా శాటిలైట్లు.. ఇస్రో ప్రకటన

ISRO Satellites: శ్రీహరి కోట నుంచి ఆదివారం చేపట్టిన ఎస్ఎస్ఎల్‌వీ డీ1/ఈఓఎస్-02 మిషన్ విఫలమైందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఈ రాకెట్ ద్వారా ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు నిరుపయోగంగా ఉంటాయని ఇస్రో తెలిపింది. ప్రయోగంలో భాగంగా మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్నప్పటికీ, టర్మినల్ దశలో రాకెట్ అదుపుతప్పింది.

Black Magic: కూతురుకు దెయ్యం పట్టిందని.. కొట్టి చంపిన తల్లిదండ్రులు

రెండు ఉపగ్రహాలను 356 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, వాటిని 356 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. ఇకపై ఈ ఉపగ్రహాలు పని చేయవని, సెన్సర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపింది. ఈ సమస్యకు గల కారణాలను తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ దీనిపై తుది నివేదిక ఇస్తుందని ఇస్రో చెప్పింది. ప్రస్తుత ప్రయోగంలోని లోపాలను సరిదిద్ది, కమిటీ ఇచ్చే ప్రతిపాదనల ఆధారంగా త్వరలోనే ఎస్ఎస్ఎల్‌వీ డీ2 ప్రయోగం చేపడతామని పేర్కొంది.

Fake Traffic Police: అసలు పోలీసులతో కలిసిపోయి చలాన్లు వసూలు చేస్తున్న నకిలీ ట్రాఫిక్ పోలీస్

ఆంధ్రప్రదేశ్‌లోని, తిరుపతి జిల్లాలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్ఎల్‌వీ డీ1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే, ప్రయోగం జరిగిన కొద్దిసేపటి తర్వాత సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించారు. తాజాగా దీన్ని విశ్లేషించి, ఉపగ్రహాలు నిరుపయోగంగా ఉన్నాయని ప్రకటించారు.