నా హత్యకు కుట్ర : సీపీని కలిసిన కేఏ పాల్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డిలపై ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జగన్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. వారిద్దరూ తన హత్యకు కుట్ర పన్నుతున్నారని, తనకు సెక్యూరిటీ కల్పించాలని మంగళవారం(జనవరి 22, 2019) హైదరాబాద్ పోలీస్ కమిషనర్(సీపీ) అంజనీకుమార్ ను పాల్ కోరారు. తనపై చేస్తున్న కొన్ని వెబ్ సైట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, యూట్యూబ్, ఫేస్ బుక్ లో తనను కించపరుస్తూ పోస్ట్ చేస్తున్న కామెడీ క్లిప్పింగ్ లను సీపీకి అందజేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

బంగోలు పోలీస్ స్టేషన్ లో తనపై ఉన్న పాత కేసులను తిరగదోడి ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని పాల్ ఆరోపించారు. త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలువనున్నట్లు తెలిపారు. 
 

ట్రెండింగ్ వార్తలు