My Home Vyoma: మై హోమ్ వ్యోమా.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 12 అల్ట్రా లగ్జరీ టవర్లు.. సిటీ లైఫ్ కి సరికొత్త బెంచ్‌మార్క్!
'మై హోమ్ గ్రూప్(My Home Vyoma)' నానక్‌రామ్‌గూడలో 'మై హోమ్ వ్యోమ' లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
- V Santhosh Kumar
- Published on- October 8, 2026 / 08:06 PM IST
my home group launches my home vyoma luxury housing project in nanakramguda
My Home Vyoma: వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల జీవనశైలి, నివాస అభిరుచులు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఇల్లు అంటే కేవలం నివసించే ప్రతిపత్తి మాత్రమే కాగా, నేడు అది ఒక హోదాకు, ప్రశాంతమైన అనుభూతికి, మెరుగైన జీవన ప్రమాణాలకు సంకేతంగా మారింది. నాలుగు దశాబ్దాలకు పైగా నాణ్యత, నమ్మకంతో రియల్ ఎస్టేట్ రంగంలో చెరగని ముద్ర వేసిన ‘మై హోమ్ గ్రూప్’ ఈ ఆధునిక ఆకాంక్షలకు అనుగుణంగా నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మై హోమ్ వ్యోమా’ (My Home Vyoma) ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వ్యూహాత్మక లొకేషన్ నానక్‌రామ్‌గూడ.. ప్రధాన కారిడార్లకు అత్యంత సమీపంలో:
హైదరాబాద్ ఐటీ, కమర్షియల్ హబ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నానక్‌రామ్‌గూడ – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంగణంలో 22.34 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కోకాపేట్-నియోపాలిస్, జూబ్లీహిల్స్ వంటి కీలక ప్రాంతాలకు కొద్ది నిమిషాల వ్యవధిలోనే చేరుకునే సౌలభ్యం ఇక్కడ ఉంది. అంతేకాకుండా శంషాబాద్ విమానాశ్రయం, ప్రముఖ ఆసుపత్రులు, అంతర్జాతీయ హోటళ్లు, షాపింగ్ సెంటర్లకు అత్యంత సమీపంలో ఉండటం దీని వ్యూహాత్మక ప్రాధాన్యతను పెంచుతోంది.
83 శాతం ఓపెన్ స్పేస్‌తో ప్రకృతి ఒడిలో ఆకాశహర్మ్యాలు.. అల్ట్రా లగ్జరీ 3 & 4 BHK ఇళ్లు:
కాంక్రీట్ వనాల మధ్య పచ్చదనానికి పెద్దపీట వేస్తూ మై హోమ్ వ్యోమాను డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో ఏకంగా 83 శాతం విస్తీర్ణాన్ని ఓపెన్ స్పేస్, ల్యాండ్‌స్కేపింగ్‌కే కేటాయించారు. జి+50/51 అంతస్తులతో ఆకాశాన్ని తాకేలా నిర్మించే 12 ఐకానిక్ టవర్లలో మొత్తం 2,360 అల్ట్రా లగ్జరీ 3&4 BHK నివాసాలు అందుబాటులో ఉన్నాయి. ఎత్తైన విలాసవంతమైన ఫ్లాట్లతో పాటు విశాలమైన ప్రకృతి అనుభూతిని ఇక్కడ నివసించే ప్రజలకు అందించడమే దీని ప్రధాన ఉద్దేశం.
లక్ష చదరపు అడుగుల్లో రెండు భారీ క్లబ్‌హౌస్‌లు.. సకల సౌకర్యాల సమాహారం:
నివాసితుల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం 1 లక్ష చదరపు అడుగులకు పైగా లైఫ్‌స్ట్రైల్ స్పేస్‌తో రెండు గ్రాండ్ క్లబ్‌హౌస్‌లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక జిమ్, స్పా, యోగా, పికిల్ బాల్, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్స్‌తో పాటు వేడుకల కోసం మల్టీపర్పస్ హాళ్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా రోజువారీ అవసరాల కోసం సూపర్ మార్కెట్, హెల్త్ సెంటర్, ఫార్మసీ, బ్యాంకులు వంటి సదుపాయాలు ప్రాంగణంలోనే కల్పించడంతో కాంప్లెక్స్ దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పూర్తి వసతులు లభిస్తాయి.
Cm Chandrababu: ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ.. గోదావరి పుష్కరాలపై చర్చ.. నిధుల కోసం విజ్ఞప్తి!
మనుషులను జోడించే సురక్షిత కమ్యూనిటీ.. భవిష్యత్తు నివాసానికి నిదర్శనం:
వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, పెట్ జోన్లు, బాస్కెట్‌బాల్ కోర్టులు, పిల్లల ప్లే ఏరియాలతో ఇక్కడ ప్రతి ఒక్కరికీ తగిన వాతావరణం లభిస్తుంది. కేవలం భవనాలు కట్టడం మాత్రమే కాకుండా, మనుషుల మధ్య అనుబంధాలను పెంచే ఆత్మీయ కమ్యూనిటీగా దీనిని మలుస్తున్నారు. ఆధునిక సాంకేతికత, ప్రకృతి పచ్చదనం, ఆరోగ్యకరమైన జీవనశైలి కలబోతగా మలచిన ‘మై హోమ్ వ్యోమా’ భవిష్యత్తు హైదరాబాద్‌లో ఒక ప్రత్యేకమైన లైఫ్‌స్ట్రైల్ ఐకాన్‌గా నిలవనుంది.
