ఝూన్సీ కేసులో కొత్త ట్విస్టు : పాత ప్రియురాలే పరిచయంచేసింది

  • Published By: chvmurthy ,Published On : February 10, 2019 / 03:59 PM IST
ఝూన్సీ కేసులో కొత్త ట్విస్టు : పాత ప్రియురాలే పరిచయంచేసింది

హైదరాబాద్ :  పవిత్రబంధం టీవీ సీరియల్ నటి ఝూన్సీ ఆత్మహత్య కేసులో  పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఝూన్సీని పెళ్లి చేసుకుంటానని  చెప్పి సూర్య మోసం చేశాడని ఝూన్సీ తల్లి పోలీసులకు తెలిపింది.  ఝూన్సీ తల్లి, సోదరుడు ఇచ్చిన  స్టేట్ మెంట్ ఆధారంగా ఝూన్సీ ప్రియుడు సూర్య తేజను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఝూన్సీ సూర్యల మధ్య నడిచిన ప్రేమ వ్యవహారం పై పోలీసులు  విచారణ చేపట్టారు. వారిమధ్య జరిగిన విషయాలపై సూర్య నుంచి సమాధానాలు రాబడుతున్నారు.
 
సూర్య వద్ద ఉన్న 2 మొబైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఝాన్సీ ప్రియుడు సూర్య ఇదివరకే మధు అనే సీరియల్‌ నటితో ప్రేమ వ్యవహారం నడిపాడని, ఆ తర్వాత మధుకు బ్రేకప్‌ చెప్పిన సూర్య, ఝాన్సీని ప్రేమించినట్లు తెలుస్తోంది. మధు సహాయంతోనే అతడు ఝాన్సీని ట్రాప్‌ చేశాడని సమాచారం. ఝాన్సీ  సూర్య పుట్టిన రోజు కానుకగా రెండు లక్షలు విలువ చేసే బైక్‌ను, ఆ తర్వాత 10 లక్షల రూపాయలు విలువచేసే బంగారు నగలను సైతం అతడికి ఇచ్చినట్లు తెలిసింది.

కాగా ….  ఝూన్సీకి బాబి, గిరి అనే ఇద్దరు ఫోటో షూట్ చేసే కెమెరామెన్లు ఉన్నారని  పోీలీసు విచారణలో సూర్య తెలిపాడు. అందులో గిరి అనే అతను ఝూన్సీని పలుమార్లు ఇబ్బంది పెట్టాడని ఝూన్సీ తనకు చెప్పినట్లు సూర్య చెప్పాడు. వారిద్దరూ ఆమెకు సినిమా ఆఫర్లు ఇప్పిస్తామని మోసం చేసారని సూర్య  తెలిపాడు. సినిమా ఆఫర్లు తగ్గటంతోటే ఝూన్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు సూర్య పోలీసులకు కొత్త విషయాలు చెప్పాడు.  ఈ కేసులో  పోలీసులు బాబి, గిరి లను కూడా  విచారించనున్నారు.