టీవీ9 సెక్రెటరీని విచారిస్తున్న పోలీసులు

  • Publish Date - May 10, 2019 / 08:48 AM IST

టీవీ9 సీఈవో రవి ప్రకాశ్‌ మీద చీటింగ్‌, ఫోర్జరీ కేసులు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే టీవీ9 కంపెనీ సెక్రెటరీ  దేవేందర్ అగార్వాల్‌ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్న ఆఫీసులోకి వెళ్లిన దేవేందర్ అగర్వాల్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 
సిగ్నేజర్ ఫోర్జరి ఎప్పుడు జరిగింది. ఎలా జరిగింది. ఫోర్జరీని జిరిగినట్లు ఎందుకు గుర్తించలేదు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. 2 నుంచి 3గంటల పాటు దేవేందర్ అగర్వాల్‌ను పోలీసులు విచారించే అవాకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంలో ఇప్పటికే టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై పలు సెక్షన్‌ల కింద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం మరిన్నిమ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.