Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు పరిహారం

సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో మృతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. ఈ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, గాయపడ్డ వారికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.

Secunderabad Fire Accident: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో మృతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. ఈ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, గాయపడ్డ వారికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.

అలాగే, అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ప్రమాదస్థలిని పరిశీలించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘దురదృష్టవశాత్తూ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు’’ అని వివరించారు.

ప్రమాదంలో గాయపడిన వారికి హైదరాబాద్ లోని అపోలో, యశోద ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, మృతులకు సంబంధించి పలువురి వివరాలు బయటకు వచ్చాయి. అల్లాడి హరీశ్‌ (33), వీరేంద్రకుమార్‌ (50), సీతారామన్‌ (48), బాలాజీ (58), రాజీవ్‌ మైక్‌ (26), సందీప్‌ మాలిక్‌ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఓ మహిళ, మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

COVID-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా రోజువారీ కేసులు… కొత్తగా 4,369 నమోదు

ట్రెండింగ్ వార్తలు