చర్చలకు పిలవలేదు : ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది

ప్రజా రావాణాను కాపాడుకునేందుకు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదని చెప్పారు.

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 06:54 AM IST
చర్చలకు పిలవలేదు : ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది

Updated On : October 16, 2019 / 6:54 AM IST

ప్రజా రావాణాను కాపాడుకునేందుకు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదని చెప్పారు.

ప్రజా రావాణాను కాపాడుకునేందుకు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మెతో ఉత్పన్నమయ్యే ఎలాంటి పరిణామాలకైనా ప్రభుత్వానిదే బాధ్యత అని తెలిపారు. బుధవారం (అక్టెోబర్ 16, 2019) హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చర్చలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదని చెప్పారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధమన్నారు. 

ప్రజా రావాణ వ్యవస్థను కాపాడటానికి పోరాటం జరుగుతుందన్నారు. ప్రజలతో మమేకమై ఉన్న ఆర్టీసీని ప్రైవేట్ పరంతో విడదీసి, ఆస్తులు కూలగొట్టే ప్రయత్నాలను అడ్డుకునే పోరాటమన్నారు. ఈ పోరాటంలో ఆర్టీసీ కార్మికులతో పాటు తెలంగాణ పౌర సమాజం మొత్తం తమ వెన్నంటే ఉంటూ ప్రత్యక్షంగా పాల్గొంటుందని తెలిపారు. నిన్న ఉద్యోగ సంఘాల జేఏసీ తమకు మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు. 

ఊహించని విధంగా అన్ని వర్గాల నుంచి సమ్మెకు మద్దతు లభిస్తుందని చెప్పారు. ఈ పోరాటంలో కులమతాలకతీతంగా ప్రజలు పాల్గొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను ఆలోచన చేసి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసికి రావాల్సిన ప్రభుత్వ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. జీతాలు విడుదలు చేయాలని డిమాండ్ చేశారు. 

సమ్మె విరమణకు పరిష్కార మార్గాలను కనుగొనాలని ప్రభుత్వానికి సూచించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు. భవిష్యత్ లో జరుగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 12 వ రోజుకు చేరింది. కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అక్టోబర్ 19న తెలంగాణ బంద్ కు కూడా పిలుపు ఇచ్చారు. సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ప్రభుత్వం కొన్ని అద్దె బస్సులను నడుపుతున్నా..అవి సరిపోవడం లేదు. దీంతో రాకపోకలు స్థంభించాయి. బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.