భారీగా బదిలీలు: మీ తహసీల్దార్ మారిపోయారేమో చూసుకోండి
తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్ల విషయంలో తీవ్ర ఆరోపణలు వస్తున్న తరుణంలోనే భారీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
శాసనసభ ఎన్నికల సమయంలో బదిలీ అయిన వారిని తిరిగి పాతస్థానాలకు బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జోన్ 5, జోన్ 6 పరిధిలో ఉన్న తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది.
మొత్తం 378 మంది తహశీల్దార్లను బదిలీ చేసింది. గత కొంతకాలంగా తమను బదిలీ చేయాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవడంతో ప్రభుత్వం లేటెస్ట్గా నిర్ణయం తీసుకుంది.
