తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

  • Publish Date - September 22, 2019 / 11:00 AM IST

తెలంగాణ శాసనసభ ఆదివారం నిరవధికంగా వాయిదా పడింది.  ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. 10 రోజులపాటు జరిగిన సమావేశాల్లో  3 బిల్లులు. ఒక తీర్మానాన్ని ఆమోదించారు. 

10  రోజుల పాటు జరిగిన సమావేశాలు వాడి వేడిగా జరిగాయి. ఆఖరి రోజు ఆదివారం సెప్టెంబర్ 22న అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చలు జరిగాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదించింది. 

అంతేకాక ప్రజా పద్దుల సంఘం, అంచనాల సమితి, ప్రభుత్వ రంగ సంస్ధల సమితి, దక్షిణ మధ్య రైల్వే జోనల్ కన్సల్టెన్సీ కమిటీ సభ్యులను స్పీకర్ పోచారం ప్రకటించారు. అనంతరం స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.