తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం

  • Publish Date - February 21, 2019 / 01:16 PM IST

ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ సమావేశాలు కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2019-2020 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం ఉదయం 11.30గంటలకు శాసనసభలో సీఎం కేసీఆర్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతారు. మండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, మాజీ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థికశాఖను ఎవరికీ కేటాయించకపోవడంతో.. ముఖ్యమంత్రి కేసీఆరే శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఫిబ్రవరి 21వ తేదీ గురువారం సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరం డిమాండ్లకు అనుబంధ గ్రాంట్లకు, జీఎస్టీ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ఆదాయం పెరుగుతున్న నేపథ్యంలో.. బడ్జెట్‌ రెండు లక్షల కోట్ల రూపాయలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. మూడు రోజులు జరిగే సమావేశాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులను స్పీకర్‌ ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ లక్షా 74 వేల కోట్లు ఉంది. గత నాలుగేళ్లలో రాష్ట్ర సొంత రాబడులు, పన్నేతర ఆదాయం బాగా పెరుగుతున్న నేపథ్యంలో.. బడ్జెట్‌ కూడా అదేస్థాయిలో పెరిగే అవకాశం ఉంది. 

Read Also: ఇదీ లెక్క : తెలంగాణ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు
Read Also: ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.25లక్షల సాయం : సీఎం కేసీఆర్
Read Also: బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేసీఆర్
Read Also: తెలంగాణ బడ్జెట్‌ : సీఎం హోదాలో తొలిసారి ప్రవేశపెట్టనున్న కేసీఆర్