Telangana Holiday: తెలంగాణలో శనివారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా శనివారం సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుంది.

Telangana Holiday: తెలంగాణలో రేపు (శనివారం) సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని (సెప్టెంబర్ 17) పురస్కరించుకుని ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Caught On Camera: టోల్ ప్లాజా దగ్గర గొడవ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మహిళలు.. వీడియో వైరల్

దీని ప్రకారం.. రేపు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. కాగా, తెలంగాణ ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వరకు ఈ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా మూడు రోజులపాటు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Sachin Tendulkar: మాజీ స్టార్ ప్లేయర్లతో విమానంలో సచిన్.. అభిమానుల్ని ఏం అడిగాడో తెలుసా!

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల ర్యాలీలు చేపట్టారు. శనివారం భారీ స్థాయిలో వేడుకలు జరగబోతున్నాయి. ఇటు టీఆర్ఎస్‌, అటు బీజేపీ, కాంగ్రెస్.. పోటాపోటీగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి.

 

ట్రెండింగ్ వార్తలు