ఓటర్ల కోసం : తెలంగాణ ఆర్టీసీ 1300 స్పెషల్ బస్సులు

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలో ప్రయాణీకుల కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 05:01 AM IST
ఓటర్ల కోసం : తెలంగాణ ఆర్టీసీ 1300 స్పెషల్ బస్సులు

Updated On : April 10, 2019 / 5:01 AM IST

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలో ప్రయాణీకుల కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

హైదరాబాద్ : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలో ప్రయాణీకుల కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. 1300 ప్రత్యేక బస్సులు నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంది. నగరంలో నివసించే ప్రజల్లో చాలా మంది తెలంగాణ వాసులతో పాటు ఏపీకి చెందినవారు కూడా ఉన్నారు.  వీరందరికీ గ్రామాల్లో ఓట్లు ఉన్నాయి. ఓట్లు వేయడానికి ప్రతీసారి వారి గ్రామాలకు వెళ్తున్నారు.

ఈ క్రమంలో ఏప్రిల్  11న లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో అభ్యర్థులను గెలిపించడానికి వెళ్తున్న తెలంగాణ ఓటర్లు టీఎస్‌ఆర్టీసీతోపాటు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రైళ్ళలో వెళ్ళాలంటే రెగ్యులర్ రైళ్లు తప్ప అదనపు రైలు తెలంగాణ జిల్లాలకు లేవు. దీంతో నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణీకులతో కిటకిటలాడిపోతున్నాయి. 
Read Also : ఎన్నికల పండుగ : నేడు, రేపు సెలవు

హైదరాబాద్ నగరానికి వచ్చి నివసిస్తున్న ఓటర్లను స్వగ్రామాలకు చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ 1300 బస్సులను నడుపుతోంది. మంగళవారం (ఏప్రిల్ 9)300 బస్సులను జేబీఎస్,ఎంజీబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ ఎక్స్‌రోడ్డు, ఎల్బీనగర్ ఎక్స్‌రోడ్డు, ఆరాంఘర్ ఎక్స్‌రోడ్డు నుంచి జిల్లాలకు నడిపిస్తుండగా బుధవారం ఒక్కరోజే 900 స్పెషల్ బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి తెలిపారు. ఎన్నికలు జరిగే 11వ తేదీ ఉదయం కూడా 100 బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు. 

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నందున సీమాంధ్ర ప్రాంతాలకు కూడా ఎంజీబీఎస్‌తోపాటు కూకట్‌పల్లి, వనస్థలిపురం, అమీర్‌పేట్, మియాపూర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. తెలంగాణ జిల్లా కేంద్రాల్లోని ముఖ్య కేంద్రాలకు ఎక్కువ బస్సులు నడిపిస్తున్నారు. సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్, ఎక్స్‌ప్రెస్, వజ్ర బస్సులను నడుపుతున్నారు. దీంతో నగరంలో  ఎన్నికల రోజు అంటే 11వ తేదీని ఆర్టీసి బస్సులు కొరత ఉండే అవకాశం వున్నట్లుగా తెలుస్తోంది. 
Read Also : జగన్ ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు : ఈసీపై చంద్రబాబు ఆగ్రహం