ఈసారి వడగాలులు అధికం : తగ్గిన టెంపరేచర్స్

  • Publish Date - March 2, 2019 / 12:50 AM IST

ఈ ఎండకాలంలో గత ఏడాదికన్నా మాత్రం వడగాలుల తీవ్రత అధికంగానే ఉంటుందని హెచ్చరించింది. వడగాలులపై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. మార్చి 06వ తేదీ నుండి శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చే గాలుల వల్ల ఉత్తర తెలంగాణలో వడగాలులు అధికంగా వీస్తాయని తెలిపింది. 

ఏడాదిలో వడగండ్ల వాన, ఉరుములు మెరుపులతో కూడిన అకస్మిక వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మార్చి 21 వరకు 39.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, మార్చి, ఏప్రిల్ మాసంలో 46 నుండి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు గత రెండు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2.4 డిగ్రీలు పెరిగి 33.4 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కన్నా 4.7 డిగ్రీలు పెరిగి 21.7 డిగ్రీలుగా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.