Thummala Nageswara Rao
Thummala Nageswara Rao: రాజకీయంగా ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వర రావు. పరోక్షంగా ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా నేలకొండ పల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో సమావేశమైన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోండి. మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధిపైనే దృష్టిపెట్టా. కార్యకర్తల కోసం ఇప్పుడు పూర్తి సమయం కేటాయిస్తా. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగా. ఇప్పుడు పాలేరు నియోజకవర్గంపైనే దృష్టి పెడతా’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఏ క్షణమైనా ముందస్తు ఎన్నికలు రావొచ్చని, కార్యకర్తలు దీనికి సిద్ధంగా ఉండాలని సూచించారు.