Kanpur: అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. బతిమాలి తెచ్చుకునేందుకు సెలవు కావాలంటూ లీవ్ లెటర్ రాసిన ఉద్యోగి

అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి తెచ్చుకునేందుకు లీవ్ కావాలని కోరాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి. దీనికి ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Kanpur: అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. బతిమాలి తెచ్చుకునేందుకు సెలవు కావాలంటూ లీవ్ లెటర్ రాసిన ఉద్యోగి

Kanpur: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి.. తన భార్యతో గొడవ పడి, ఆ గొడవ సర్దుబాటు చేసుకునేందుకు రెండు రోజులు లీవ్ కావాలని కోరాడు. తాజాగా అతడి లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ నగర్‌కు చెందిన సంషాద్ అహ్మద్ అనే వ్యక్తి ప్రేమ్ నగర్ బ్లాక్ డెవలప్‌మంట్ ఆఫీసులో క్లర్కుగా పని చేస్తున్నాడు.

Cyber Fraudster: ఆన్‌లైన్‌లో బర్త్‌డే కేక్ ఆర్డర్ చేసి రూ.1.67లక్షలు పోగొట్టుకున్న మహిళ

అయితే, ఇటీవల సంషాద్ అతడి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భార్య అలిగి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోవడంతో చాలా బాధపడ్డ సంషాద్ తన భార్యను ఎలాగైనా తిరిగి ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాడు. ఇందుకోసం వాళ్ల ఊరికి వెళ్లి, నచ్చజెప్పి పిల్లలతో సహా ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం రెండు రోజులు లీవ్ కావాలని ఉన్నతాధికారులకు లీవ్ లెటర్ రాశాడు. అందులో తన భార్యతో గొడవ పడ్డట్లు, ఆమెను తిరిగి ఇంటికి తెచ్చుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ లీవ్ లెటర్‌కు ఉన్నతాధికారులు ఆమోదం తెలిపి, సెలవు మంజూరు చేశారు.

kaleshwaram project : కాళేశ్వరం ప్రాజెక్టులో రూ,70 కోట్ల అవినీతి జరిగింది..దీనిపై విచారణ జరిపించాలి : YS షర్మిల

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగులు వేరే ఏవో కారణాలు చెప్పి లీవ్ తీసుకుంటూ ఉంటారు. కుటుంబ విషయాల గురించి లీవ్ లెటర్‌లో ప్రస్తావించడానికి ఇష్టపడరు. కానీ, సంషాద్ మాత్రం నిజాయితీగా ఆ విషయాన్ని లీవ్ లెటర్‌లో పేర్కొనడం విశేషం. ఈ లెటర్ అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంషాద్ నిజాయితీని చాలా మంది ప్రశంసిస్తున్నారు.