kaleshwaram project : కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70 కోట్ల అవినీతి జరిగింది..దీనిపై విచారణ జరిపించాలి : YS షర్మిల

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.70 కోట్ల అవినీతి జరిగిందని దీనిపై విచారణ జరిపించాలని ఎర్రమంజిల్‌లోని జలసౌధ ముందు బైఠాయించి వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

kaleshwaram project : కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70 కోట్ల అవినీతి జరిగింది..దీనిపై విచారణ జరిపించాలి : YS షర్మిల

kaleshwaram project In telangana : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.70 కోట్ల అవినీతి జరిగిందని దీనిపై విచారణ జరిపించాలని ఎర్రమంజిల్‌లోని జలసౌధ ముందు బైఠాయించి వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎటువంటి నాణ్యత లేకుండా ప్రాజెక్టు పనులు ఉన్నాయని..ప్రాజెక్టు డ్యామేజ్ కు క్లైడ్ బరెస్ట్ అని కారణం చెప్పటం హాస్యాదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు కాంట్రాక్టర్లను అధికారులు వెనకేసుకొస్తున్నారు అంటూ విమర్శించారు.లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదని..మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పుగా మార్చారు అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు షర్మిల.

కాళేశ్వరం ప్రాజెక్టును మెగా కృష్ణారెడ్డికి కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఎర్రమంజిల్‌లోని జలసౌధ ముందు బైఠాయించి ఆమె నిరసన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో సీఎం కేసీఆర్‌ కుటుంబానికి వాటా ఉందని ఆరోపించారు. వైఎస్సార్‌ హయాంలో నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కు చెదరలేదని..ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం మాత్రం మూడేళ్లకే వరదలో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై త్వరలో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు షర్మిల.