పోలీస్ విచారణకు హాజరైన TV9 CFO మూర్తి

  • Publish Date - May 10, 2019 / 07:11 AM IST

సైబరాబాద్ CCS పోలీసుల ఎదుట TV9 CFO మూర్తి హాజరయ్యారు. 2019, మే 10వ తేదీ శుక్రవారం ఉదయం 12 గంటల సమయంలో కార్యాలయానికి చేరుకున్నారు మూర్తి. నేరుగా సైబరాబాద్ కమిషనర్ ఛాంబర్‌లోకి వెళ్లారు. ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. ఫోర్జరీ, నిధుల మళ్లింపు, ఫైళ్లు, హార్డ్ డిస్క్ల మాయంపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. టీవీ 9 కంపెనీలో ఆర్థిక వ్యవహారాలు చూస్తుంటారు మూర్తి. నోటీసులు అందుకున్న వారిలో ఆయన ఒకరు. 
Also Read : TV9 రవి ప్రకాష్ చుట్టూ ఉచ్చు : విచారణకు హాజరవుతారా

కొంతకాలం క్రితం TV9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా.. రవిప్రకాష్‌పై కంప్లయింట్ చేసింది. రవిప్రకాశ్‌, శివాజీతోపాటు మరికొందరు ఫోర్జరీకి పాల్పడి నకిలీ పత్రాలు సృష్టించారంటూ ఫిర్యాదులో స్పష్టం చేశారు. దీంతో కోర్టు ఆర్డర్ ప్రకారం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ముగ్గురూ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయి.

టీవీ 9 కార్యాలయం, రవి ప్రకాష్ ఇంట్లో మే 09వ తేదీ గురువారం పోలీసులు సోదాలు నిర్వహించారు. అంతకంటే ముందు సీఎఫ్‌వో మూర్తి టీవీ 9 ఆఫీసుకు చేరుకుని ఫైళ్లు, హార్డ్ డిస్క్‌లు మాయం చేశారని ఆరోపణలున్నాయి. నోటీసులు అందుకున్న మూర్తి హాజరయ్యారు. మూర్తితోపాటు నోటీసులు అందుకున్న రవి ప్రకాష్, నటుడు శివాజీ కూడా విచారణకు హాజరుకావాల్సి ఉంది. వారు శుక్రవారం ఎంక్వయిరీకి హాజరుకాకపోతే.. మరోసారి CRC 41 ప్రకారం నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. 
Also Read : TV9 కార్యాలయంలో రవిప్రకాశ్ ను విచారిస్తున్న పోలీసులు

ట్రెండింగ్ వార్తలు