ఉపరితల ద్రోణి : తగ్గిన ఉష్ణోగ్రతలు

  • Publish Date - February 27, 2019 / 12:58 AM IST

ఒడిశా నుండి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో రెండు రోజుల వరకు దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. దీని కారణంగా పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల వరకు తగ్గినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటు పగటి ఉష్ణోగ్రత 35.5 డిగ్రీలుగా నమోదైందని తెలిపారు. మరో రెండు రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.